Bhola Shankar Court Case : మెగాస్టార్ నటించిన 'భోళా శంకర్' రిలీజ్‌కు ఎట్టకేలకు అడ్డంకులు తొలిగిపోయాయి. డబ్బుల విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ, సినిమా విడుదల నిలిపివేయాలని గాయత్రి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ సతీశ్ వేసిన పిటీషన్‌ను సిటీ సివిల్ కోర్టు కొట్టిపారేసింది. 'భోళాశంకర్' విడుదలకు లైన్ క్లియర్ చేసింది. ప్రకటించిన తేదీ ప్రకారం.. ఆగస్ట్ 11న సినిమా విడుదల చేసుకునేలా తీర్పునిచ్చింది.
అసలేం జరిగిందంటే.. 'ఏజెంట్' సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. ఇప్పుడు 'భోళాశంకర్' చిత్రాన్ని ఆయనే నిర్మించారు. వీటిలో 'ఏజెంట్' మూవీ భారీ డిజాస్టర్‌ను అందుకోని నష్టాల్ని మిగల్చగా.. 'భోళాశంకర్' ఆగస్ట్ 11న రిలీజ్‌కు రెడీ అయింది. అయితే తనకు ఏజెంట్ సినిమా హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని, ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు రూ.30కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని గాయత్రి ఫిలిమ్స్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీశ్ కోర్టును ఆశ్రయించారు. 'భోళాశంకర్' సినిమా విడుదలలోపు డబ్బులు విషయంలో తనకు ఏదో ఒకటి స్పష్టతనిస్తానని చెప్పిన అనిల్ సుంకర, ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తకుండా తప్పించుకుంటున్నారంటూ, మూవీ విడుదల తేదీని ఆపాలని.. సతీశ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై తనకు న్యాయం చేయాలంటూ కోర్టును కోరారు.
అయితే ఆగస్ట్ 9న ఈ కేసుకు సంబంధించి 'ఏజెంట్' సినిమా నగదు లావాదేవీలను పరిశీలించిన న్యాయస్థానం.. నేడు ఆగస్ట్ 10కు వాయిదా వేసింది. మరోసారి నేడు ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలను విచారించింది కోర్టు. అలా ఇరువైపుల వాదనలు వినిన న్యాయస్థానం.. చివరికి గాయత్రి ఫిలిమ్స్ సతీశ్ పిటీషన్‌ను కొట్టిపారేసింది. 'భోళాశంకర్' రిలీజ్‌కు క్లియరెన్స్ ఇచ్చింది.
Bholashankar Release Date : ఇక 'భోళాశంకర్' సినిమా విషయానికొస్తే.. ఆగస్ట్ 11న తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చిరు సరసన తమన్నా నటించగా.. ఆయనకు చెల్లిలిగా కీర్తిసురేశ్ నటించింది. ఈ సినిమాను 'కంత్రి' 'బిల్లా', 'శక్తి', 'షాడో' వంటి చిత్రాలతో వరుస పరాజయాలను అందుకుని.. దాదాపు పదేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన మెహర్ రమేశ్ దీనిని తెరకెక్కించారు.
చిరంజీవి కాంట్రవర్సీ కామెంట్స్‌పై దిల్ రాజు రియాక్షన్.. ఏమన్నారంటే?
Bholashankar Chiranjeevi : చైనా స్కూల్లో మెగాస్టార్ మేనియా.. వీడియో ప్రెజెంటేషన్‌తో..!