Bhanu Sree Mehra Bikini Photo : భాను శ్రీ మెహ్రా.. ఈ పేరు వింటే చాలా మంది తెలుగు సినీ ప్రేక్షకులు పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు. కానీ వరుడు సినిమాలో అల్లు అర్జున్ హీరోయిన్ అంటే మాత్రం గుర్తు పట్టే అవకాశం ఉంటుంది. ఆ చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. ఆ తర్వాత ఎక్కడా అంతగా కనిపించలేదు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం, ఆ తర్వాత కూడా ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు లేకపోవడం వల్ల తెలుగు ప్రేక్షకులు దాదాపుగా ఈమెను మర్చిపోయారు. అడపాదడపా చిన్న చిన్న సినిమాల్లో నటించినా.. ఈమె గురించి అంతా పట్టించుకోవడమే మానేశారు.
ఓ చిత్రంలో వెన్నెల కిశోర్‌కు జోడీగా నటించిన ఈ భామ.. ఆ తర్వాత రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే, శర్వానంద్ రన్, కీర్తి సురేష్ మిస్ ఇండియా, అల్లరి నరేష్ బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో మెరిసింది. కానీ హీరోయిన్గా మాత్రం రాణించలేకపోయింది. ఈ మధ్యే రీసెంట్గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. బాగానే రచ్చ చేస్తోంది. కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేస్తోంది. రీసెంట్గా బిగ్ బాస్ షో గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. చెత్త షో అంటూ విమర్శలు కూడా చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేశారంటూ చెప్పి మీడియాలో హాట్‌టాపిక్‌గా కూడా మారింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్ వేదికగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసి ట్రెండ్ అయింది. అందులో ఆమె బికినీ ధరించి రచ్చ చేసింది. ఇటీవలే ఆమె భాను శ్రీ వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. ట్రావెలింగ్ వీడియోలను అందులో పోస్ట్ చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే ఫేమస్ బీచ్ ఉలువాటు బీచ్‌కు వెళ్లి బికినీ ధరించి సందడి చేసింది. ఆ పిక్స్‌ను నెట్టింట్లో షేర్ చేసి వైరల్‌గా మారింది.
-
My Uluwatu vlog is live now - it’s got Bali’s best beaches, stunning sunsets & a lot of fun ! Watch it if you’d like or go fly a kite .. 🤷♀️
— Bhanushree Mehra (@IAmBhanuShree) November 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Link below ! https://t.co/Jh1KuPYng4 pic.twitter.com/WDWybTRNBM
">My Uluwatu vlog is live now - it’s got Bali’s best beaches, stunning sunsets & a lot of fun ! Watch it if you’d like or go fly a kite .. 🤷♀️
— Bhanushree Mehra (@IAmBhanuShree) November 4, 2023
Link below ! https://t.co/Jh1KuPYng4 pic.twitter.com/WDWybTRNBMMy Uluwatu vlog is live now - it’s got Bali’s best beaches, stunning sunsets & a lot of fun ! Watch it if you’d like or go fly a kite .. 🤷♀️
— Bhanushree Mehra (@IAmBhanuShree) November 4, 2023
Link below ! https://t.co/Jh1KuPYng4 pic.twitter.com/WDWybTRNBM
కొంటె చూపులతో ఆకట్టుకుంటున్న మల్లు బ్యూటీ - రెడ్ అవుట్‌ఫిట్‌లో ప్రియా స్టన్నింగ్ లుక్స్
మహేశ్ ఫ్యాన్స్‌కు ముందుగానే దీపావళి షురూ - గుంటూరు కారం 'దమ్ మసాలా' సాంగ్ ప్రోమో వచ్చేసిందోచ్