Bhagvant Kesari Movie Good Touch Bad Touch Scene : నందమూరి బాలకృష్ణ దర్శకత్వం వహించిన 'భగవంత కేసరి' బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్ఫుల్గా నడుస్తోంది. బాలయ్య యాక్టింగ్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని తండ్రీ కూతురుగా బాలయ్య - శ్రీలీల ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకుల మనసును బాగా తాకుతోంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం గురించి నెట్టింట ఓ చర్చ జరుగుతోంది. అభిమానులు సినిమాలోని ఉన్న ఓ సన్నివేశాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. అదే 'గుడ్ టాచ్ బ్యాడ్ ట చ్'. దీని గురించి బాలయ్య చిన్నారులకు అద్భుతంగా వివరించారు.
'పాపా.. నీకు వాడు చాక్లెట్ ఇచ్చి నీ మీద చేతులేస్తుంటే అది తప్పని తెలియదా? - స్కూల్ యూనిఫాంలో ఉన్న ఐదేళ్ల చిన్నారిని అడుగుతాడు భగవంత్ కేసరి.
'ఊహూ..' అని అమాయకంగా చెబుతుంది ఆ పసిపాప చాక్లెట్ తింటూనే...
అలా వేయరాని చోట చెయ్యి వేస్తే తప్పని ఆ చిన్నారికి ఎవరో ఒకరు చెబితేనే కదా తెలిసేది.
మరి ఎవరు చెప్పాలి. ఇంట్లో అమ్మ లేదా స్కూల్లో టీచర్. కానీ, వాళ్లు చెప్పడం లేదు. చెప్పాలని కూడా చాలా మందికి తెలియదు. కొందరికి చెప్పాలని ఉన్నా ఎలా చెప్పాలన్న సంశయంతో ఆగిపోతున్నారు.
అభంశుభం తెలియని చిన్నపిల్లలపై మేకవన్నె పులుల్లాంటి కొందరు మానవ మృగాలు చేస్తున్న అకృత్యాల గురించి విని తల్లిదండ్రులు ఉలిక్కి పడుతున్నారే తప్ప తమ బిడ్డలకు జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం, ధైర్యం చేయడం లేదు.
అయితే ఆ ఆడబిడ్డల కోసం ఆ పని చేయడానికి ముందుకు కదిలాడు అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి.
ఆ పాపను ఎత్తుకుని నేరుగా వాళ్ల స్కూల్‌కు వెళ్లాడు. అక్కడి టీచర్లు ఏనాడూ చెప్పని ‘బ్యాడ్ టచ్’ పాఠం పిల్లలందరికీ వివరంగా చెప్పాడు. అంటే సినిమాకొచ్చిన ప్రతి ఒక్క తల్లికీ, తండ్రికీ, చిన్నారికీ చెప్పాడన్నమాట.
ఏం చెప్పాడు - ఆటో డ్రైవరు, స్కూల్లో ప్యూను, పక్కింటి అంకుల్, ఆఖరికి ఇంట్లో తాతయ్య, అన్నయ్య అయినా సరే.. వేయరాని చోట చేయి వేస్తే వెంటనే పరిగెత్తుకెళ్లి అమ్మకు చెప్పమని.. అమ్మనే మిమ్మల్ని కాపాడుకుంటుందని.
అమ్మలకూ ఓ మాట చెప్పాడు. ‘మా అడవిలో ఇక్కడ క్రూరమృగాలు తిరుగుతుంటాయి అని బోర్డు ఉంటుంది. కానీ ఈ సమాజంలో మాత్రం మానవ మృగాల నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎలాంటి సూచికలూ ఉండవు. కాబట్టి అమ్మలే తమ బిడ్డలకు ఆ జాగ్రత్తలు చెప్పాలని సూచించాడు’. కాబట్టి ఈ మాట విన్నాక అమ్మలు ఆ ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం.
ఓ కమర్షియల్ సినిమాలో, అందులోనూ ఓ స్టార్ హీరో సినిమాలో ఈ అంశాన్ని స్పృశించడం నిజంగా అభినందనీయమనే చెప్పాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Bhagvant Kesari Day 2 Collections : 'భగవంత్ కేసరి'.. తీవ్ర పోటీలోనూ బాలయ్య జోరు!
Bhagavanth Kesari Movie Review : బొమ్మ దద్దరిల్లింది.. చిచ్చా అందరికి యాదుంటాడు ఇగ!