Bhagvant Kesari Day 3 Collections : వయసు పెరుగుతున్నా ఏమాత్రం అలసిపోకుండా వరుస బ్లాక్ బాస్టర్ హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ దుసుకెళ్తున్నారు నటసింహాం నందమూరి బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజాాగా ఆయన నటించిన సందేశాత్మక చిత్రం 'భగవంత్ కేసరి'. చిన్నారుల రక్షణ గుడ్ టాచ్ బ్యాడ్ టచ్ కాన్సెప్ట్‌కు మాస్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన చిత్రమిది. తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకున్న ఈ చిత్రం మూడో రోజు శనివారం కూడా జోరు కొనసాగించింది. మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా మూడో రోజు తెలుగు 2డీలో మార్నింగ్ షో ఆక్యూపెన్సీ 33.87 శాతం.. మధ్యాహ్నం ఆక్యూపెన్సీ 48.60శాతం, ఈవెనింగ్ ఆక్యూపెన్సీ 56.85 శాతం, నైట్ ఆక్యూపెన్సీ 63.04 శాతం నమోదయ్యాయట.
మూడో రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల విషయానికి వస్తే.. నైజాంలో రూ. 3.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.45 కోట్లు, ఏపీలో రూ.4.30 మొత్తంగా 10.65 కోట్ల షేర్ వచ్చింది. ఏపీలో వచ్చేసరికి.. వెజాగ్లో రూ.1.01కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 72 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 68 లక్షలు, నెల్లూరులో రూ.59 లక్షలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు రూ. 19.90 కోట్ల గ్రాస్ వచ్చిందట. మూడో రోజుల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాస్ రూ.71.02కోట్లు వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. .
ఇక ఇండియా వైడ్‌గా చూసుకుంటే తొలి రోజు రూ.16.6కోట్ల నెట్, రెండో రోజు 7కోట్ల నెట్.. మూడో రోజు రూ.7.75కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయట. అంటే మొత్తంగా దేశవ్యాప్తంగా మూడు రోజుల్లో 31.35కోట్ల నెట్ అందుకుందన్న మాట.
-
HOUSEFULL DAY 3 for the Crowd Favourite #BhagavanthKesari ❤️🔥
— Shine Screens (@Shine_Screens) October 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Evening & Night Shows Soldouts/Fast fillings across the states🔥
🎟️ https://t.co/rrWPhVwU6B#DasaraWinnerKesari#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MsKajalAggarwal @MusicThaman @sahugarapati7… pic.twitter.com/aACOKMA2Jt
">HOUSEFULL DAY 3 for the Crowd Favourite #BhagavanthKesari ❤️🔥
— Shine Screens (@Shine_Screens) October 21, 2023
Evening & Night Shows Soldouts/Fast fillings across the states🔥
🎟️ https://t.co/rrWPhVwU6B#DasaraWinnerKesari#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MsKajalAggarwal @MusicThaman @sahugarapati7… pic.twitter.com/aACOKMA2JtHOUSEFULL DAY 3 for the Crowd Favourite #BhagavanthKesari ❤️🔥
— Shine Screens (@Shine_Screens) October 21, 2023
Evening & Night Shows Soldouts/Fast fillings across the states🔥
🎟️ https://t.co/rrWPhVwU6B#DasaraWinnerKesari#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MsKajalAggarwal @MusicThaman @sahugarapati7… pic.twitter.com/aACOKMA2Jt
సినిమాలో నటసింహం బాలయ్యతో పాటు శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ యాక్ర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించ్చారు. ఈ చిత్రం రివ్యూ(Bhagavanth Kesari Movie Review) విషయానికొస్తే.. బాలకృష్ణ - శ్రీలీల నటన, కథాంశం.. సంభాషణలు, భావోద్వేగాలు, పతాక సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు మైనస్ అయ్యాయి. ఫైనల్‌గా సినీ ప్రేక్షకులు.. భగవంత్ కేసరి చాలా కాలం యాదుంటాడు అని అభిప్రాయపడుతున్నారు.
Leo Box Office Collection Day 1 : బాక్సాఫీస్ ముందు 'లియో' రికార్డులు.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?