Bhagvant Kesari 18 Days Collections : నటసింహ నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాలతో అటు సీనియర్ హీరోలకు, ఇటు కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య.. ఇటీవలే 'భగవంత్ కేసరి' చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీసు మందు మంచి టాక్ సంపాదించింది. ప్రారంభంలో మంచి కలెక్షన్లు సాధించింది. అయితే మధ్యలో కాస్త వసూళ్లు నెమ్మదించాయి. అయితే వీకెండ్లో మళ్లీ కలెక్షన్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' సినిమా 18 రోజుల్లో రాబట్టిన వసూళ్ల వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
-
The festival continues at the cinemas with #BhagavanthKesari💥
— Shine Screens (@Shine_Screens) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
From a ww theatrical business of 57.63cr To collecting a resounding share of 70.01CR and a Gross of 139.19CR worldwide 😎🔥#BlockbusterBhagavanthKesari is another remarkable film for everyone❤️🔥… pic.twitter.com/CAAOQjLEEy
">The festival continues at the cinemas with #BhagavanthKesari💥
— Shine Screens (@Shine_Screens) November 6, 2023
From a ww theatrical business of 57.63cr To collecting a resounding share of 70.01CR and a Gross of 139.19CR worldwide 😎🔥#BlockbusterBhagavanthKesari is another remarkable film for everyone❤️🔥… pic.twitter.com/CAAOQjLEEyThe festival continues at the cinemas with #BhagavanthKesari💥
— Shine Screens (@Shine_Screens) November 6, 2023
From a ww theatrical business of 57.63cr To collecting a resounding share of 70.01CR and a Gross of 139.19CR worldwide 😎🔥#BlockbusterBhagavanthKesari is another remarkable film for everyone❤️🔥… pic.twitter.com/CAAOQjLEEy
'భగవంత్ కేసరి' 18 రోజుల కలెక్షన్స్..
'భగవంత్ కేసరి' సినిమాకు 18 రోజుల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.70.01 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. రూ.139.19 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా రూ.57.63 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సినిమా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీనిపై సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందించారు. ' 'భగవంత్ కేసరి'ని మరో మరిచిపోలేని సినిమాలా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
'భగవంత్ కేసరి' చాలా కాలం యాదుంటాడు..
ఈ సినిమాలో నటసింహం బాలయ్యతో పాటు శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించ్చారు. ఈ చిత్రం రివ్యూ(Bhagavanth Kesari Movie Review) విషయానికొస్తే.. బాలకృష్ణ - శ్రీలీల నటన, కథాంశం.. సంభాషణలు, భావోద్వేగాలు, పతాక సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు మైనస్ అయ్యాయి. ఫైనల్‌గా సినీ ప్రేక్షకులు.. భగవంత్ కేసరి చాలా కాలం యాదుంటాడు అని అభిప్రాయపడుతున్నారు.
Balakrishna Hat Trick Hits : హ్యాట్రిక్ హిట్స్‌తో ట్రెండ్ సెట్ చేసిన బాలకృష్ణ.. ఆ హీరోలే టార్గెట్!