ETV Bharat / entertainment

Bhagavanth Kesari Trailer : 'భగవంత్ కేసరి' బ్లాస్టింగ్​.. ఊహకందని రేంజ్​లో ట్రైలర్​ అప్డేట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 4:18 PM IST

Bhagavanth Kesari Trailer : నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీటీమ్​ మరో అదిరిపోయే బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఆ సంగతులు..

భగవంత్ కేసరి బ్లాస్టింగ్ అప్డేట్​
Bhagavanth Kesari Trailer

Bhagavanth Kesari Trailer : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. ఫన్​ డైరెక్టర్​ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం భగవంత్ కేసరి. 'ఐ డోంట్ కేర్'​ సినిమా ట్యాగ్ లైన్​. యంగ్​ సెన్సేషనల్​ బ్యూటీ శ్రీలీల మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ అండ్​ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా గ్రాండ్​గా రానున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. దీంతో ఇప్పటికే ప్రమోషన్స్​లో జోరు పెంచి అభిమానులను అదిరిపోయే కిక్​ ఇస్తున్న మూవీటీమ్​.. ​తాజాగా అదిరిపోయే బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. సినిమా ట్రైలర్​ రిలీజ్ డేట్​ను అనౌన్స్ చేసింది. అలానే ఓ సరికొత్త పోస్టర్​ను కూడా విడుదల చేసింది.

పోస్టర్​లో బాలయ్య.. కుర్చిలో గంభీరంగా కూర్చొని చేతిలో గన్ రాడ్​ పట్టుకుని కనిపించారు. ఆయన వెనక.. అధికారులు మందిగా.. వెపన్స్​ చేతిలో పట్టుకుని నిలబడి ఉన్నారు. జైలు ఆవరణలో ఉన్నట్లు ఈ పోస్టర్​ డిజైన్ చేశారు. ట్రైలర్​ను అక్టోబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడు చూడని విధంగా.. ఊహకందని రేంజ్​లో ఉంటుందని పేర్కొన్నారు.

కాగా, 'అఖండ', 'వీర సింహారెడ్డి' వంటి బ్యాక్​ టు బ్యాక్​ బ్లాక్ ​బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం కావడం వల్ల భగవంత్ కేసరిపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో బాలయ్య కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ అందుకుంటారని అటు సినీ ప్రియులు, ఇటు అభిమానులు బలంగా ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్​, సాంగ్స్​తో పాటు ఇతర ప్రచార చిత్రాలకు.. ఆడియెన్స్​ నుంచి మంచి ఆదరణ దక్కింది. ముఖ్యంగా తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్​, తన యాక్షన్​తో అదరగొట్టేశారు.

Bhagavanth Kesari Release Date : ఈ సినిమాలో ప్రముఖ తమిళ విలక్షణ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్​ యాక్టర్​ అర్జున్ రాంపాల్​ పవర్​ ఫుల్​ విలన్​గా బాలయ్యతో తలపడనున్నారు. బాలయ్య సరసన కాజల్​ అగర్వాల్ కనిపించారు. నటసింహానికి భార్యగా కనిపించనున్నారట. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్​ 19న గ్రాండ్​గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్‌- సంగీతం, సి.రామ్‌ ప్రసాద్‌ - ఛాయాగ్రహణం బాధ్యతలు చూసుకున్నారు. షైన్ స్క్రీన్స్​ బ్యానర్​పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మించారు.

Bhagavanth Kesari Ganesh Anthem : 'భగవంత్ కేసరి' గణేశ్ సాంగ్ రిలీజ్.. తమన్ బీట్స్​కు బాలయ్య డ్యాన్స్ అదుర్స్..

Mokshagna Latest Pics : సింహం యాటకొచ్చే సమయం వచ్చినట్టుంది.. 'భగవంత్ కేసరి' సెట్స్​లో మోక్షజ్ఞ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.