ETV Bharat / entertainment

Bhagavanth Kesari Trailer : 'భగవంత్ కేసరి' ట్రైలర్​ రిలీజ్​ అక్కడే.. టైం 'లాక్' చేసిన మూవీ యూనిట్​ - భగవంత్ కేసరి రిలీజ్ డేట్

Bhagavanth Kesari Trailer : నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్ దగ్గర పడడం వల్ల మూవీ టీమ్​ మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ట్రైలర్ విడుదల సమయంతో పాటు వేదికను ప్రటించింది. ఆ సంగతులు..

bhagavanth kesari trailer
bhagavanth kesari trailer
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 7:47 PM IST

Updated : Oct 7, 2023, 6:35 AM IST

Bhagavanth Kesari Trailer : నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'భగవంత్‌ కేసరి' ట్రైలర్​ ఈ నెల 8న రాత్రి 8.16 నిమిషాలకు విడుదల కానుంది. ఈ మేరకు 'లాక్​డ్​ అండ్​ లోడెడ్'​ అంటూ ఓ పోస్టర్​ను ప్రకటించింది చిత్రబృందం. ఈ ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను హనుమకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌ అండ్ సైన్స్‌ కాలేజీలో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. సినిమాలో మాస్‌, యాక్షన్‌ అంశాలతో హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయని సినీ వర్గాలు తెలిపాయి.

కాగా, 'అఖండ', 'వీర సింహారెడ్డి' వంటి బ్యాక్​ టు బ్యాక్​ బ్లాక్ ​బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం కావడం వల్ల భగవంత్ కేసరిపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో బాలయ్య కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ అందుకుంటారని అటు సినీ ప్రియులు, ఇటు అభిమానులు బలంగా ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్​, సాంగ్స్​తో పాటు ఇతర ప్రచార చిత్రాలకు.. ఆడియెన్స్​ నుంచి మంచి ఆదరణ దక్కింది. ముఖ్యంగా తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్​, తన యాక్షన్​తో అదరగొట్టేశారు. బాలకృష్ణ ఈ చిత్రంలో నేలకొండ భగవంత్ కేసరిగా పక్కా తెలంగాణ యాస, భాషలో మాస్ అవతారాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నట్టు టీజర్‌తోనే హింట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.

Bhagavanth Kesari Release Date : ఈ సినిమాలో ప్రముఖ తమిళ విలక్షణ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్​ యాక్టర్​ అర్జున్ రాంపాల్​ పవర్​ ఫుల్​ విలన్​గా బాలయ్యతో తలపడనున్నారు. బాలయ్య సరసన కాజల్​ అగర్వాల్ నటించారు. కాజల్​ నటసింహానికి భార్యగా కనిపించనున్నారట. మరో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్​ 19న గ్రాండ్​గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్‌ 18న యూఎస్‌ఏలో గ్రాండ్‌గా ప్రీమియర్స్ వేయనున్నట్లు తెలుస్తోంది. తమన్‌- సంగీతం, సి.రామ్‌ ప్రసాద్‌ - ఛాయాగ్రహణం బాధ్యతలు చూసుకున్నారు. షైన్ స్క్రీన్స్​ బ్యానర్​పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మించారు.

Bhagavanth Kesari Trailer : 'భగవంత్ కేసరి' బ్లాస్టింగ్​.. ఊహకందని రేంజ్​లో ట్రైలర్​ అప్డేట్​

Balakrishna Unstoppable 3 : ఓవైపు భగవంత్​ కేసరి.. మరోవైపు అన్​స్టాపబుల్​-3.. బాలయ్య ఫ్యాన్స్​కు డబుల్​ ట్రీట్​!

Last Updated : Oct 7, 2023, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.