ETV Bharat / entertainment

Bhagavanth Kesari Overseas Booking : 'లియో'ను కాదని.. బాలయ్య మూవీ టికెట్లు కొంటున్న తమిళ ఫ్యాన్స్​! - బాలయ్య బాబు తాజా సినిమా

Bhagavanth Kesari Overseas Booking : నందమూరి బాలకృష్ట, అనిల్ రావిపూడి కాంబినేేషన్​లో వస్తున్న 'భగవంత్ కేసరి' సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వస్తోందట. తమిళ అభిమానులు లియోకి బదులు బాలయ్య బాబు సినిమా టికెట్లు కొంటున్నారని సమాచారం.

Bhagavanth Kesari Overseas Booking
Bhagavanth Kesari Overseas Booking
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 7:47 PM IST

Bhagavanth Kesari Overseas Booking : నందమూరి నటసింహం బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'భగవంత్ కేసరి'. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్​, సాంగ్స్ మూవీపై హైప్​ను మరింత పెంచేశాయి. ఈ క్రమంలో బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ యాక్షన్ ప్యాక్​డ్​ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా.. ఈ సినిమా అక్టోబర్​ 19న థియేటర్లలో సందడి చేయనుండగా.. యూఎస్​లో ఒక్కరోజు ముందుగానే(అక్టోబర్​ 18) విడుదలకానుంది. దీంతో యూఎస్​ బాక్సాఫీస్ వద్ద ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఈ బుకింగ్స్​కు ఆడియెన్స్​ నుంచి అద్భుతమైన స్పందన వస్తోందట. పలు థియేటర్ల బుకింగ్స్​ హౌస్ ఫుల్ అయ్యాయట. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు.. ఈ సినిమాతో పాటు యూఎస్​లో విజయ్ హీరోగా 'లియో' సినిమా కూడా రిలీజయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే, తమిళ హీరోల అభిమానుల మధ్య

సోషల్​ మీడియా వార్​ నడుస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా లియో సినిమా టికెట్ల విషయంలోనూ ఈ వార్​ మొదలైంది. బాలయ్య బాబు నటించిన 'భగవంత్ కేసరి', దళపతి విజయ్ నటించిన 'లియో' చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ యాంటీ ఫ్యాన్స్ బాలయ్య బాబు సినిమా టికెట్లు ఎక్కువగా కొనేలా ప్లాన్లు చేస్తున్నారట. లియోకి బదులు భగవంత్​ కేసరికి వెళ్లమని సినీ ప్రియులను ప్రేరేపిస్తున్నారట.

Leo VS Bhagvanth Kesari : మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ.. ఈ విషయమై బయట కథనాలు వస్తున్నాయి. మరీ ఈ రెండు సినిమాల్లో బాక్సాపీస్ వద్ద ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. యాక్షన్​ థ్రిల్లర్​ అండ్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ప్రేక్షకుల ముందుకు భగవంత్ కేసరి రానుంది. సినిమాలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. గ్యాంగ్​ స్టర్​ నేపథ్యంలో లోకేశ్​ కనగరాజ్ -విజయ్ కాంబోలో 'లియో' థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో త్రిష హీరోయిన్​.

Unstoppable Season 3 : అన్​స్టాపబుల్​లో 'భగవంత్ కేసరి' మూవీటీమ్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్​గా శ్రీలీల, కాజల్

Mokshagna Bhagavanth Kesari : 'భగవంత్​ కేసరి' సెట్స్​కు మోక్షజ్ఞ అందుకే వెళ్లేవారట.. వచ్చే ఏడాదే సినీ ఎంట్రీ!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.