ETV Bharat / entertainment

ఓటీటీలోనూ దుమ్మురేపిన బాలకృష్ణ- గూగుల్​లో 'భగవంత్​ కేసరి' హవా! - బాలకృష్ణ రాబోయే సినిమాలు

Bhagavanth Kesari OTT Performance : నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్​ కేసరి ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ అమెజాన్ ఓటీటీలో టాట్​లో ట్రెండింగ్​ అవుతోంది. దీంతోపాటు ఎక్కువ మంది గూగుల్​ చేసిన సినిమాగా భగవంత్ కేసరి రికార్డు సృష్టించింది.

Bhagavanth Kesari Ott Performance
Bhagavanth Kesari Ott Performance
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 5:07 PM IST

Updated : Nov 27, 2023, 6:24 PM IST

Bhagavanth Kesari OTT Performance : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ- స్టార్​ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన సినిమా 'భగవంత్​ కేసరి'. దసరా కానుకగా అక్బోబర్ 19న విడుదలైన ఈ సినిమా.. దాదాపు ఐదు వారాల పాటు బాక్సాఫీసు ముందు మంచి వసూళ్లు రాబట్టింది. బ్రేక్​ ఈవెన్​ను కూడా సాధించి లాభాలు తెచ్చిపెట్టింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీ ప్లాట్​ఫామ్ అమెజాన్ ప్రైమ్​లోకి వచ్చింది. అయితే థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ భగవంత్​ కేసరి రికార్డులు సృష్టిస్తోంది. ఓటీటీలోకి విడుదలైన 24 గంటల్లోనే టాప్​లో ట్రెండింగ్ అయింది.

సందేశాత్మక సినిమాగా రూపొందిన 'భగవంత్ కేసరి' తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతూ.. అమెజాన్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ఇక తెలుగు వెర్షన్‌ మొదటి స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. హిందీ వెర్షన్‌ టాప్ 3లో నిలిచింది. అలాగే గూగుల్​లో అత్యధిక మంది వెతికిన చిత్రంగా భగవంత్ కేసరి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ అమెజాన్‌ పోస్టర్‌ విడుదల చేసింది.

బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్!
ఆరు పదుల వయసులో కూడా నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస హిట్స్​తో దూసుకుపోతున్నారు. 'అఖండ', 'వీరనరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్స్ హిట్ సాధించి పుల్ జోష్​లో ఉన్నారు. ఈ విజయాలతో టాలీవుడ్​ సీనియర్ హీరోలతో పాటు కుర్ర కథానాయకులకూ సవాల్​ విసురుతున్నారు.

Balakrishna Upcoming Projects : మరోవైపు.. బాలకృష్ణ ఎన్​బీకె-109 వర్కింగ్ టైటిల్​తో మరో ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత 110వ చిత్రం బోయపాటి శ్రీను డైరెక్షన్​లో చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్​ హిట్​గా నిలిచిన 'అఖండ'కు సీక్వెల్​గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సీక్వెల్​లో అఘోర పాత్రతో పాటు పొలిటికల్ టచ్​​ ఇచ్చేలా దర్శకుడు బోయపాటి ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఆ తర్వాత గోపిచంద్ మలినేని, పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో బాలకృష్ణ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

పవన్​ కల్యాణ్​ గురించి నేనెప్పుడూ చెప్పేది అదే- నాకన్నా ఎక్కువసార్లు వాళ్లే అలా చేశారు : నితిన్

'కాంతార చాప్టర్ 1' టీజర్ ఔట్ - ప్రీక్వెల్​తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు!

Last Updated : Nov 27, 2023, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.