ETV Bharat / entertainment

Bhagavanth Kesari : 'భగవంత్​ కేసరిలో శ్రీలీల గ్లామర్​ మిస్​?'.. వారికి అనిల్​ రావిపూడి​ స్ట్రాంగ్​ కౌంటర్​! - భగవంత్​ కేసరి కొత్త సినిమాలు

Bhagavanth Kesari Anil Ravipudi : హీరో బాలకృష్ణ నటించిన 'భగవంత్​ కేసరి'.. బాక్సాఫీస్​ వద్ద హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీలో శ్రీలీల గ్లామర్‌ మిస్‌ అయ్యిందని రివ్యూలు రాసినట్లు వార్తలు వచ్చాయి. వాటిపై డైరెక్టర్​ అనిల్ రావిపూడి స్పందించారు.

Bhagavanth Kesari Anil Ravipudi
Bhagavanth Kesari Anil Ravipudi
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 7:52 PM IST

Bhagavanth Kesari Anil Ravipudi : స్టార్​ డైరెక్టర్​ అనిల్​ రావిపూడి దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ- శ్రీలీల కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'భగవంత్​ కేసరి'. గురువారం విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్​ వద్ద హిట్​ టాక్​ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం​ ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో అనిల్​ రావిపూడి మాట్లాడారు.

"'భగవంత్ కేసరి'.. ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటాది అని ప్రమోషన్స్‌ మొదలుపెట్టినప్పటి నుంచి చెబుతున్నాం. దాన్ని మీ అందరూ నిజం చేశారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందనకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ ఆరు సినిమాలు చేశా. ఫిల్మ్‌ మేకర్‌గా ఇది నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది. ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకోవడానికి ప్రధాన కారణం భావోద్వేగాలు. తండ్రీకుమార్తెల ఎమోషన్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ సర్‌కు థ్యాంక్యూ చెప్పాలి. ఆయన అవకాశం ఇవ్వకపోయి ఉంటే నన్ను నేను ఇలా నిరూపించుకునేవాడిని కాదు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి వర్క్‌ చేశారు. శ్రీలీల.. విజ్జిపాపగా అద్భుతంగా యాక్ట్ చేసింది. క్లైమాక్స్‌లో చూపించిన యాక్షన్‌ సీన్స్‌ కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత గొప్ప విజయాన్ని అందుకుంటుంది" అని అనిల్‌ రావిపూడి ఆశాభావం వ్యక్తం చేశారు.

శ్రీలీల గ్లామర్‌ ఈ సినిమాలో మిస్‌ అయ్యిందని కొంతమంది రివ్యూ రాశారు. వాటిపై మీ స్పందన ఏమిటి
అనిల్‌ రావిపూడి: నేను రివ్యూలను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌ అన్నింటి కంటే పెద్దది. జనాల నుంచి వచ్చే మాటే ఒక సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సినిమాలోని సున్నితమైన అంశాలను అర్థం చేసుకుని చాలా మంది పాజిటివ్‌గానే రివ్యూలు రాశారు. మీరు అన్నట్టు శ్రీలీల గ్లామర్‌, డ్యాన్సులు ఈ సినిమాలో మిస్‌ అయ్యాయని రివ్యూలు రాసిన వాళ్లు ఆమెకు అభిమానులు అయ్యి ఉంటారు. వాళ్లు ఆమె నుంచి డ్యాన్సులు చూడాలని కోరుకున్నారేమో. ఒక ఫోబియాతో బాధపడే అమ్మాయిని సివంగిలా మార్చాలనుకునే తండ్రి కథలోనూ డ్యాన్సులు చూడాలనుకున్నారంటే వారి మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రానికి సంబంధించిన మరో పాటను త్వరలోనే యాడ్‌ చేస్తారని విన్నాం?
అనిల్‌ రావిపూడి: ఇప్పుడు జనాలందరూ మా చిత్రాన్ని అత్యద్భుతంగా ఆదరిస్తున్నారు. కంటెంట్‌కు అడ్డుపడుతుందనే ఆ పాటను కట్‌ చేశాం. ఎక్కడ యాడ్‌ చేయాలో మాకే అర్థం కావడం లేదు. పాట కావాలని ఇప్పుడు ఎవరూ అడగలేదు. ఎందుకంటే, సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులు కూడా కలిసి ప్రయాణిస్తున్నారు. మేము కూడా చర్చించుకుంటున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక పాట యాడింగ్‌ గురించి అనౌన్స్‌ చేస్తాం.

సిలిండర్స్‌ పేల్చడం అనే ఐడియా ఎలా వచ్చింది?
అనిల్‌ రావిపూడి: కేజీయఫ్‌లో చూపించిన విధంగా గన్స్‌ పేల్చడం ఈ మధ్య సినిమాల్లో కామన్‌ అయ్యింది. బాలయ్య బాబు కూడా పేలిస్తే చూడాలని అనుకున్నా. నేను తీసే టైమ్‌కి అందరూ కాల్చేశారు. అందరూ కాల్చేశాక ఆయనతో రిపీట్‌ చేయించడం బాగోదని అనిపించింది. చివరకు ఈ ఆలోచన వచ్చింది. ఇది ప్రేక్షకులకు బాగా రీచ్‌ అయ్యింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhagavanth Kesari Sreeleela : కాజల్​ కన్నా శ్రీలీలకే ఎక్కువ రెమ్యునరేషన్​.. ఎన్ని కోట్లు తీసుకుందంటే?

Sreeleela New Movie : సూపర్​ హీరోయిన్​గా శ్రీలీల కొత్త మూవీ?.. అనిల్​ రావిపూడి​ స్క్రిప్ట్​ రాయడమే ఆలస్యమట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.