ETV Bharat / entertainment

Unstoppable: అమ్మాయిలకు లైన్.. అర్ధరాత్రి ఫోన్ కాల్స్​​.. బాలయ్య గోల్డెన్ డేస్​

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్‌ - 2' కొత్త ప్రోమో వచ్చేసింది. ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ సెలబ్రిటీ టాక్‌షో నాలుగో ఎపిసోడ్‌కు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, సినీ నటి రాధిక, రాజ్యసభ ఎంపీ సురేశ్‌ విచ్చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ప్రోమోను మీరూ చూసేయండి..

బాలయ్య అన్​స్టాపబుల్​ రాధికా ప్రోమో
Balayya Unstoppableradhika promo
author img

By

Published : Nov 17, 2022, 7:56 PM IST

Updated : Nov 17, 2022, 8:22 PM IST

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్‌ - 2' కొత్త ప్రోమో వచ్చేసింది. ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ సెలబ్రిటీ టాక్‌షో నాలుగో ఎపిసోడ్‌కు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, సినీ నటి రాధిక, రాజ్యసభ ఎంపీ సురేశ్‌ విచ్చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ప్రోమోలో.. 'బాలయ్య కుటుంబాన్ని చూసిన మీకు... ఇవాళ బాలయ్య స్నేహాన్ని పరిచయం చేయాలనిపించింది' అంటూ నటసింహం నందమూరి బాలకృష్ణ తన కాలేజీ రోజుల్ని గుర్తుచేసుకున్నారు.

అర్ధరాత్రి ఫోన్ కాల్​... 'అన్‌స్టాపబుల్ 2' స్టేజి మీదకు కిరణ్ కుమార్ వచ్చిన వెంటనే 'అధ్యక్షా... నా మైక్ ఆపేశారు అధ్యక్షా!' అంటూ బాలకృష్ణ నవ్వులు పూయించారు. తాను స్పీకర్ అయిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసిన బాలకృష్ణ అదే మాట్లాడారని కిరణ్ గుర్తుచేసుకున్నారు. తమ కాలేజీ రీ యూనియన్ ఫోటోలు చూపించిన బాలయ్య.. ఆ రోజుల్లో తాము చేసిన హంగామా గురించి చెబితే ఎవరూ నమ్మరని అన్నారు. 'మేం అమ్మాయిలకు సైట్ కొట్టడం కోసం బైక్స్ ఎక్స్‌ఛేంజ్ చేసుకునేవాళ్లం' అంటూ నాటి రోజుల్ని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. వెంటనే మాట అందుకున్న కిరణ్​కుమార్​.. 'అక్కడ చేసిన తర్వాతే ఇక్కడ నటుడు అయ్యావ్' అంటూ నవ్వించారు.

ఆయన గొప్ప నాయకడు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం గురించి, ఆయన చివరగా ప్రయాణించిన హెలికాఫ్టర్ ప్రయాణం గురించి ప్రస్తావన రాగా.. రాజశేఖర్ రెడ్డి గొప్ప నాయకుడు అని బాలకృష్ణ ప్రశంసించారు. ఆయన గొప్పతనం గురించి మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డితో కలిసి క్రికెట్ ఆడారు. ఈ క్రమంలోనే రాధిక కూడా వీరితో కలిసి జాయిన్ అయ్యారు. స్టేజ్​పై సందడిని తమ సంభాషణలతో మరింత రెట్టింపు చేశారు.

చిరంజీవిలో నచ్చనిది ఏంటి?.. నాలో నచ్చినది ఏంటి?.. 'ఇప్పటి వరకు నన్ను అడగటానికి మొహమాట పడింది ఏదైనా అడగండి' అని రాధిక అనడం... దానికి బాలకృష్ణ సిగ్గు పడటం భలేగా సాగింది. తాను చెన్నైలో ఉన్నప్పుడు తనకు గాడ్ ఫాదర్ రాధిక అని బాలకృష్ణ అన్నారు. రజనీకాంత్, విజయ్ కాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ - వాళ్ళందరితో ఆమె చేశారని, కానీ తన లాంటి సూపర్ స్టార్‌తో నటించే అవకాశం ఆమెకు రాలేదన్నారు. అంతే కాదు... 'చిరంజీవిలో నచ్చనది ఏంటి? నాలో నచ్చింది' అని రాధికను ప్రశ్నించారు. అలా ఈ ప్రోమో మొత్తం ఆద్యంతం సరద సరదాగా సాగింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఈ ఏడాది టాప్​ 10 ట్రైలర్స్​ ఇవే​ రికార్డ్​ వ్యూస్​తో సోషల్​మీడియాను షేక్​ చేశాయిగా

Last Updated : Nov 17, 2022, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.