ETV Bharat / entertainment

'మాస్​ మొగుడు' వచ్చేశాడు.. పవన్​ కల్యాణ్​తో బాలయ్య-శ్రుతి.. స్టెప్పులు సూపర్​! - అడివిశేష్ గూఢచారి 2 ఫస్ట్ లుక్ పోస్టర్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. యంగ్​ హీరో అడివిశేష్​ 'గూఢచారి 2' ప్రీ విజన్​ వీడియో, బాలయ్య 'వీరసింహారెడ్డి'లోని 'మాస్​ మొగుడు' సాంగ్​ రిలీజ్ అయ్యాయి. అవి సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి. వాటిని మీరు చూసేయండి..

Balakrishna Veerasimha reddy Mass mogud song
'మాస్​ మొగుడు' సాంగ్​లో పవన్​ కల్యాణ్ ఎంట్రీ
author img

By

Published : Jan 9, 2023, 7:39 PM IST

Updated : Jan 9, 2023, 7:57 PM IST

రోజు రోజుకు సంక్రాంతి చిత్రాల హీట్‌ పెరుగుతోంది. పందెం కోళ్లలా.. నువ్వా నేనా అంటూ మన హీరోలు తమ చిత్రాలతో తలపడనున్నారు. ఇక బాదం, పిస్తాలతో పెంచిన పందెం కోడిలా బాలయ్య.. వీర సింహా రెడ్డితో బరిలోకి దిగనున్నారు. అఖండ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత బాలయ్య ఫ్యాక్షన్​ అవతారంలో రానుండటం వల్ల ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర సాంగ్స్​, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. బాలయ్యలోని మాస్‌ యాంగిల్‌, డైలాగ్స్‌, యాక్షన్‌ సీన్లు, డ్యాన్స్​ ఇలా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే ప్రతీది ఈ సినిమాలో ఉండనున్నట్లు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది.

అయితే వరుస అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ మూవీటీమ్​ తాజాగా మరో సాంగ్​ను రిలీజ్​ చేసింది. చిత్రంలోని మాస్‌ మొగుడు అంటూ సాగే లిరికల్​ మాస్‌ బీట్‌ సాంగ్​ను రిలీజ్ చేసింది. ఇందులో బాలయ్య-శ్రుతి లుక్స్​, స్టెప్పులు అదిరిపోయాయి. తమన్ మ్యూజిక్​ ఆడియెన్స్​కు పూనకాలు తెప్పిస్తోంది. అయితే ఈ లిరికల్​ సాంగ్​లో.. పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ ఈ సాంగ్​ సెట్​కు వచ్చి సందడి చేసిన మేకింగ్ వీడియోను కూడా జత చేసింది. కాగా, శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ యాక్టర్‌ దునియా విజయ్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్​ కుమార్​ కీలక పాత్రలో కనిపించనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆసక్తిగా 'గూఢచారి 2' ప్రీ విజన్​ వీడియో​.. మేజర్‌, హిట్‌2 విజయాలతో జోరు మీదున్నారు కథానాయకుడు అడివి శేష్‌. ఇప్పుడీ జోష్‌లోనే తన తదుపరి చిత్రంపై ఫోకస్​ పెట్టారు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన గూఢచారి చిత్రానికి కొనసాగింపుగా 'జి 2' పేరుతో కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్​తో పాటు ప్రీ విజన్​ ​ వీడియోను షేర్ చేశారు. ఇందులో అడివి శేష్‌ స్టైలిష్‌ యాక్షన్‌ లుక్​లో కనిపించబోతున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే షూట్ కానున్నట్టు తెలియజేశారు మేకర్స్. దీన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమాతో ఎడిటర్‌ వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. గూఢచారి కథ మొత్తం భారతదేశంలోనే జరగ్గా.. ఈ రెండో భాగం అంతర్జాతీయంగా ఉండనుంది. తొలి భాగంలో కనిపించిన పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ రెండో భాగంలో పరిచయం కానున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌ విడుదల చేస్తున్నారు.

ఇదీ చూడండి: Sridevi Drama Company: వారెవ్వా​.. ఎన్టీఆర్ డైలాగ్‌తో చిన్నారి అదరగొట్టేసిందిగా

Last Updated : Jan 9, 2023, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.