ETV Bharat / entertainment

చెంఘీజ్‌ఖాన్​ బయోపిక్​లో బాలయ్య.. ఇంతకీ ఆయన ఎవరబ్బా?

చెంఘీజ్‌ఖాన్‌పై సినిమా చేయాలని ఉందంటూ బాలయ్య తన మనసులోని మాట చెప్పడంతో సినీ ప్రియులందరూ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. ఇంతకీ చెంఘీజ్‌ ఖాన్‌ ఎవరంటే?

balakrishna  chengizkhan movie
చెంఘీజ్‌ఖాన్​ బయోపిక్​లో బాలయ్య.. ఇంతకీ ఆయన ఎవరబ్బా?
author img

By

Published : Jan 7, 2023, 2:59 PM IST

'నటుడిగా నేనింకా సంతృప్తి చెందలేదు.. చెంఘీజ్‌ఖాన్‌ సినిమా ఎప్పటికైనా చేసి తీరుతా' అని నందమూరి నటసింహం బాలకృష్ణ 'వీర సింహారెడ్డి' ప్రీ రిలీజ్‌ వేడుకలో చెప్పిన సంగతి తెలిసిందే. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఆ సినిమా చేస్తానని అన్నారు. అయితే దీంతో సినీ ప్రేక్షకులందరూ చెంఘీజ్‌ఖాన్‌ ఎవరబ్బా అని ఆరా తీయడంలో బిజీ అయ్యారు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరంటే?

ప్రపంచంలోనే పేరు పొందిన మంగోల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తే ఈ చెంఘీజ్‌ఖాన్‌. ఈశాన్య ఆసియాలోని ఓ సంచారజాతికి చెందిన అతడి అసలు పేరు టెమూజిన్‌. మంగోల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించి.. దాని విస్తరణ కోసం ఎన్నో దండయాత్రలు చేశాడని పలు చారిత్రక రచనల్లోని సమాచారం. అలా, ఏదైనా రాజ్యంపై చెంఘీజ్‌ దాడి చేస్తే.. అక్కడి ప్రజలపై అతడి సైన్యం క్రూరత్వం ప్రదర్శించేదని.. మహిళలను సైతం ఎత్తుకు వెళ్లిపోయేవాళ్లని ఆ రచనల్లో ఉండేది. అతడి సైన్యం చేసే వికృత చేష్టలు తట్టుకోలేక పలు రాజ్యాధినేతలు సామంతులుగా మారిపోయారనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే అతడి గురించి, అతడి సామ్రాజ్యం గురించిన వాస్తవాలపై ఎక్కడా సరైన సమాచారం లేదు.

మరి, ఇలాంటి ప్రతినాయక లక్షణాలు ఉన్న చెంఘీజ్​ఖాన్​పై సినిమా చేయాలని బాలయ్య చెప్పడం వల్ల అందరిలోనూ ఆసక్తి మొదలవ్వడంతో పాటు పలు అనుమానాలు వచ్చాయి. అసలు ఆ సినిమా ఎలా ఉండనుంది? చెంఘీజ్‌ ఖాన్‌ అంటే విలన్‌ మాత్రమేనా? ఒకవేళ సినిమా చేస్తే బాలయ్యను విలన్‌గానే చూపిస్తారా? ఈసినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు? రచయితగా ఎవరు వ్యవహరిస్తారు? ఇలా ఎన్నో అంశాలపై సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పవర్‌ఫుల్‌ కథకు విజయేంద్ర ప్రసాద్‌ రచయితగా, రాజమౌళి దర్శకత్వం చేస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చూడండి: బుడ్డోడి డైలాగ్​ విని మురిసిపోయిన బాలయ్య.. ఇంతకీ ఆ బాబు ఎవరంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.