ETV Bharat / entertainment

Balagam Venu Daughter : 'బలగం' వేణు​ కూతురిని చూశారా?.. ఎంత క్యూట్​గా ఉందో! - బలగం వేణు భార్య

Balagam Venu Daughter : 'బలగం' సినిమాతో దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన వేణు.. మరోసారి తండ్రిగా ప్రమోషన్​ పొందారు. ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Balagam Venu Daughter
Balagam Venu Daughter
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 5:09 PM IST

Updated : Oct 20, 2023, 5:23 PM IST

Balagam Venu Daughter : బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన 'బలగం' సినిమా దర్శకుడు వేణు.. మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్​మీడియా వేదికగా తెలిపారు. "ఆడబిడ్డతో ఆశీర్వాదం పొందాం. ఈ శుభవార్తను నా పెద్ద కుటుంబంతో పంచుకోవడం నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది" అని పోస్ట్​ చేశారు. తన కుమార్తెతో దిగిన ఫొటోను కూడా షేర్​ చేశారు.

Balagam Venu Family : టాలీవుడ్‌లో గుర్తుండిపోయే సినిమాల్లో 'బలగం' కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అప్పటివరకు కమెడియన్​గా అందరికీ తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నారని బయటపడింది. ఇకపోతే వేణుకు ఇదివరకే ఓ కుమారుడు ఉన్నాడు. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానెల్‌లో పలు వీడియోస్ కూడా చేశారు.

మళ్లీ దిల్​రాజుతోనే..
Balagam Venu New Movie : 'బలగం' తర్వాత మళ్లీ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వేణు మరో సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో 'బలగం'లో నటించిన ప్రియదర్శినే హీరోగా నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్​కు సంబంధించి ఎలాంటి వివరాలు అధికారికంగా రాలేదు.

బలగం మూవీకి అవార్డుల పంట
Balagam Movie Awards : 'బలగం' చిత్రం ఈ ఏడాది మార్చి 3న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మొత్తం ప్రతిష్టాత్మక తొమ్మిది పురస్కారాలను అందుకుంది. అంతర్జాతీయ ఫిల్మ్​ ఫెస్టివల్స్​లోనూ సత్తా చాటింది. లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులతో పాటు 'వాషింగ్టన్‌ డీసీ ఇంటర్నేషనల్‌ సినిమా ఫెస్టివల్‌', 'ఒనికో ఫిల్మ్‌ అవార్డు' వంటి పలు విదేశీ అవార్డులను కూడా ముద్దాడింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్, సుధాకర్‌ రెడ్డి, రూపా లక్ష్మి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించి అద్భుతంగా నటించారు. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాల నేపథ్యంలో రూపొందిందీ చిత్రం.

కుటుంబ పెద్ద చనిపోయాక ఏర్పడిన పరిస్థితుల చుట్టూ ఈ కథను నడిపించారు. అలాగే చిత్రంలో రక్త సంబంధాలు, బంధుత్వ విలువలను ఎంతో బాగా చూపించారు. భీమ్స్ ఈ సినిమాకు స్వరాలను సమకూర్చారు. ఒకప్పుడు పల్లె ప్రజలంతా తెరలు కట్టి సినిమాలు చూసినట్టు.. ఈ చిత్రాన్ని ప్రస్తుత కాలంలోనూ తెలంగాణలోని పలు పల్లెల్లో ప్రదర్శించారు. ఈ సినిమాను చూసి గ్రామస్థులంతా భావోద్వేగానికి గురై కన్నీళ్లు కూడా పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Comedian Dhanraj Direction : వేణు బాటలోనే ధన్​రాజ్​.. త్వరలో డైరెక్టర్​గా.. 'బలగం' లాంటి స్క్రిప్ట్ రెడీ!

'బలగం'కు మరో అంతర్జాతీయ అవార్డు.. బెస్ట్​ డైరెక్టర్​గా వేణు

Last Updated : Oct 20, 2023, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.