ఇటీవల మృతి చెందిన సూపర్‌స్టార్ కృష్ణ అస్థికలను ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగా నదిలో కలిపాడు. ఆ సమయంలో తన తాతను గుర్తు చేసుకొని జయకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. అమెరికాలో ఉన్న జయకృష్ణ... తాత మరణ వార్త తెలుసుకొని హుటాహుటిన అక్కడి నుంచి బయల్దేరి వచ్చారు.
అప్పటికే కృష్ణ అంత్యక్రియలు పూర్తికావడం వల్ల చివరి చూపు దక్కలేదని జయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కృష్ణ నవంబర్ 15న గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
![jayakrishna funeral his grandfather](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17007489_thu-2.jpg)
![jayakrishna funeral his grandfather](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17007489_thu-3.jpg)
![jayakrishna funeral his grandfather](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17007489_thu-4.jpg)
ఇదీ చదవండి: తెరపైకి రతన్ టాటా జీవితం.. సుధ కొంగర దర్శకత్వంలో..