ETV Bharat / entertainment

'ఆర్యన్​ ఖాన్​ను కావాలనే టార్గెట్​ చేశారు.. దర్యాప్తులో అనేక లోపాలు' - ఎన్​సీబీ రిపోర్టు ఆర్యన్ ఖాన్​ డ్రగ్స్​ కేసు

ప్రముఖ బాలీవుడ్​ నటుడు షారుక్​ ఖాన్ తనయుడు ఆర్యన్​ నిందితుడిగా ఉన్న క్రూజ్​ డ్రగ్స్​ కేసులో విజిలెన్స్​ అధికారులు రిపోర్టు సమర్పించారు. కావాలనే ఆర్యన్​ ఖాన్​ను టార్గెట్​ చేశారని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే..

aryan khan deliberately targeted
aryan khan deliberately targeted
author img

By

Published : Oct 19, 2022, 12:16 PM IST

Updated : Oct 19, 2022, 12:32 PM IST

ప్రముఖ నటుడు షారుక్​ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న ముంబయి క్రూజ్ డ్రగ్స్​ కేసుకు సంబంధించిన రిపోర్టును విజిలెన్స్​ అధికారులు సమర్పించారు. విచారణలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో సమీర్ వాంఖడే దర్యాప్తు అధికారిగా ఉన్నప్పుడు పలు అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. కొంత మంది అధికారులు అనుమానాస్పదంగా ప్రవర్తించారని రిపోర్టులో పేర్కొన్నారు. షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్​ను కావాలనే టార్గెట్​ చేశారని స్పష్టం చేశారు.

ఆర్యన్ ఖాన్ కేసుతో పాటు ఈ అధికారులు చేసిన ఇతర కేసుల దర్యాప్తుల్లో కూడా లోపాలు కనిపించాయి. వీటన్నింటికి సంబంధించిన నివేదికను విజిలెన్స్ అధికారుల బృందం దిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపించింది. ఈ తప్పిదాలకు పాల్పడిన ముంబయి ఎన్​సీబీ జోనర్​ డైరక్టర్​తో పాటు ఇతర అధికారుపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

క్రూజ్​ డ్రగ్స్​ కేసులో ఎన్​సీబీ 14 మంది నిందితులపై గత మే 27న 6 వేల పేజీల చార్జ్​షీట్​ ఫైల్​ చేసింది. అయితే ఇందులో ఐదుగురి పేర్లను తొలగించింది. అందులో ఆర్యన్​ ఖాన్​ కూడా ఉన్నారు. అయితే ఆర్యన్ ఖాన్​ డ్రగ్స్​ కేసు తప్పుడు దర్యాప్తు నేపథ్యంలో.. మాజీ ఎన్​సీబీ అధికారి సమీర్​ వాంఖడేపై కేంద్ర ప్రభుత్వం గత మేలో విచారణకు ఆదేశించింది. అనంతరం విచారణ ప్రారంభించిన ఎన్​సీబీ.. ఆర్యన్​ ఖాన్​కు క్లీన్​ చిట్​ ఇచ్చింది.

2021 అక్టోబర్‌ 2న ముంబయి తీరప్రాంతంలో క్రూజ్‌ నౌకలో జరిగిన రేవ్‌ పార్టీపై ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ ఘటనలో ఆర్యన్ ఖాన్​తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. అక్టోబర్‌లో అరెస్టయిన ఆర్యన్ ఖాన్.. 25 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

ఇవీ చదవండి : బేబీ బంప్​ ట్రెండ్​.. ఖరీదైన బైక్​పై ప్రెగ్నెంట్​ లేడీ ఫొటోషూట్

రంగస్థల నటుడు గూఢచారిగా.. 'సర్దార్‌'కు స్ఫూర్తి ఆ సంఘటనే

Last Updated : Oct 19, 2022, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.