ETV Bharat / entertainment

మురగదాస్​కు.. మృణాల్​ ఠాకూర్​ బ్రేక్ ఇస్తుందా? - శివకార్తికేయన్​ మురగదాస్​

AR murugadoss sivakarthikeyan : మురగదాస్​-శివకార్తికేయన్​ కలిసి ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలని హీరోయిన్ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్​కు లుక్​ టెస్ట్ కూడా చేశారట. ఆ వివరాలు..

murgadoss
మురగదాస్​కు.. మృణాల్​ ఠాకూర్​ కలిసొస్తుందా?
author img

By

Published : Jul 1, 2023, 1:16 PM IST

AR murugadoss sivakarthikeyan : గతంలో వరుస చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్లను అందుకున్న దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌. 'గజని', 'తుపాకీ', 'సర్కార్​' వంటి విజయవంతమైన చిత్రాలతో తమిళంతో పాటు తెలుగు వారినీ బాగా ఆకట్టుకున్నారు. అయితే తెలుగు వారికి మాత్రం గట్టి ఫ్లాప్​లే ఇచ్చారు! అప్పట్లో ఆయన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తెరకెక్కించినా 'స్టాలిన్' పర్వాలేదనిపించింది. కానీ మహేశ్​ బాబు 'స్పైడర్​' చిత్రం భారీ డిజాస్టర్​గా నిలిచిపోయింది. సరే ఏదేమైనప్పటికీ.. ఎంత గొప్ప డైరెక్టరే అయినా అప్పుడప్పుడు ఫ్లాప్​లనేవి సహజం. అయితే ఇప్పుడాయనకు ఆ డిజస్టర్లు వరుసగా పలకరిస్తున్నాయి.

చివరగా ఆయన దర్శకత్వం వహించినా రజనీకాంత్‌ 'దర్బార్‌' కూడా బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. దీంతో ఆయన దర్శకత్వానికి కాస్త గ్యాప్ ఇచ్చి.. నిర్మాతగా మారి '1947 ఆగస్టు 16' నిర్మించారు. అలానే సీనియర్ హీరోయిన్ త్రిష టైటిల్ రోల్​ రూపొందిన 'రంగీ'కి కథ అందించారు. అయితే ఈ రెండు కూడా బోల్తా కొట్టాయి.

Mrunal thakur upcoming tamil movie : అలా మూడేళ్ల నుంచి ఒక్క సినిమాకు కూడా దర్శకత్వం వహించని ఆయన.. ఇప్పుడు ఎట్టకేలకు ఓ హీరోతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయనే కోలీవుడ్​ హీరో శివ కార్తికేయన్. డాన్, డాక్టర్​ సహా తదితర చిత్రాల హిట్​లతో ప్రస్తుతం ఈ హీరోకు మార్కెట్​ కూడా బాగానే ఉంది. ఈయనతోనే మురగదాస్​ ఓ పాన్​ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అయ్యారని చెన్నైలో టాక్ వినిపిస్తోంది. హీరోయిన్​గా సీతారామం, లస్ట్​ స్టోరీస్​ 2 బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలనలో ఉందని తెలిసింది. తాజాగా టెస్ట్ షూట్​ కూడా చేశారట. దాదాపుగా ఆమె ఖరారు​ అయినట్లు తెలుస్తోంది. ఇక అనిరుధ్​ రవిచందర్​ను మ్యాజిక్​ డైరెక్టర్​గా తీసుకుంటున్నారట. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఓ డిఫరెంట్​ పాయింట్​తో చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.

మరి వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న మురగదాస్​కు.. మంచి మార్కెట్​ ఉన్న హీరో, హీరోయినే దొరికారు. మరి ఆయన.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గట్టి కమ్​ బ్యాక్ ఇస్తారో? లేదా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో? అనేది ప్రస్తుతం సినీ ప్రియుల్లో ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇదీ చూడండి :

The night manager shobhita : తమన్నాను మించేలా శోభిత బోల్డ్​ సీన్స్​.. ఈ వీడియో చూస్తే..

సూర్య.. మళ్లీ ఆ డైరెక్టర్​తోనే.. ఈ సారి ఎన్ని వందల కోట్లో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.