తుళునాడులోని భూతకోల సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకున్న చిత్రం 'కాంతార'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ ముందు సంచలనం సృష్టించింది. అయితే ఈ చిత్రం తర్వాత ఈ భూతకోల ఉత్సవాలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం మొదలయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలకు వరకు చాలా మంది దీని గురించి తెలుసుకునేందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ అనుష్క శెట్టి కుటుంబ సమేతంగా ఈ భూతకోల ఉత్సవాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంగళూర్లో జరిగిన భూత కోల వేడుకల్లో అనుష్క తన కుటుంబంతో కలిసి పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆమె అక్కడి నృత్యాన్ని తన సెల్ ఫోన్ కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తూ కనిపించారు. పట్టుచీర కట్టుకుని ఎంతో అందంగా కనిపించారు. మరి ఇది పాత వీడియోనా లేదా కొత్తదా అనే స్పష్టం లేదు.
-
Another glimpse of Sweety attending Boothakola Festival in her home town ❤️❤️✨✨#AnushkaShetty #Sweety #Anushka48 pic.twitter.com/XvwIXTnjha
— PRANUSHKA FANCLUB 🌸❤️ (@pranushka_fan) December 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Another glimpse of Sweety attending Boothakola Festival in her home town ❤️❤️✨✨#AnushkaShetty #Sweety #Anushka48 pic.twitter.com/XvwIXTnjha
— PRANUSHKA FANCLUB 🌸❤️ (@pranushka_fan) December 18, 2022Another glimpse of Sweety attending Boothakola Festival in her home town ❤️❤️✨✨#AnushkaShetty #Sweety #Anushka48 pic.twitter.com/XvwIXTnjha
— PRANUSHKA FANCLUB 🌸❤️ (@pranushka_fan) December 18, 2022
కాగా, అనుష్క నిశ్శబ్దం చిత్రం తర్వాత చాలా కాలంగా వెండితరపై కనిపించలేదు. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ చిత్రం చేస్తున్నారు. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమెను ఇలా భూతకోల ఉత్సవాల్లో కనిపించే సరికి.. అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అనుష్క సినిమా త్వరగా రిలీజ్ కావాలని మంచి హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.
-
Glimpse of Lady SuperStar #AnushkaShetty today from her hometown in Mangalore. Looking beautiful in a Saree🤩❤️✨
— AnushkaShettyPlanet✨ (@Sweety_ShettyFc) December 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Queen is back!!! pic.twitter.com/G12KxoyBtx
">Glimpse of Lady SuperStar #AnushkaShetty today from her hometown in Mangalore. Looking beautiful in a Saree🤩❤️✨
— AnushkaShettyPlanet✨ (@Sweety_ShettyFc) December 18, 2022
Queen is back!!! pic.twitter.com/G12KxoyBtxGlimpse of Lady SuperStar #AnushkaShetty today from her hometown in Mangalore. Looking beautiful in a Saree🤩❤️✨
— AnushkaShettyPlanet✨ (@Sweety_ShettyFc) December 18, 2022
Queen is back!!! pic.twitter.com/G12KxoyBtx
ఇదీ చూడండి: పవన్‌తో గొడవ.. అసలు విషయం చెప్పేసిన అలీ.. 6 ఏళ్ల పాటు ఒక్క పూట భోజనంతోనే..