ETV Bharat / entertainment

మరో బిగ్‌బాస్‌ జంట బ్రేకప్​.. ఆ నటుడికి 'యాంకర్'​ గుడ్​బై - losliya bigg boss

మరో బిగ్‌బాస్‌ జంట బ్రేకప్ చెప్పేసుకుంది. హౌస్​లో దగ్గరైన వారు.. బయటికి వచ్చాక కూడా తమ ప్రేమను కొనసాగించారు. అయితే ఇప్పుడు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఈ ఇద్దరు బిగ్​బాస్​ కంటెస్టెంట్లు ఎవరంటే?

Another bigbass couple who said breakup
మరో బిగ్‌బాస్‌ జంట బ్రేకప్
author img

By

Published : Apr 8, 2022, 7:16 PM IST

భాషలకు అతీతంగా సక్సెస్​ఫుల్​ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది బిగ్​బాస్. అన్ని రాష్ట్రాల్లో టాప్​ రేటింగ్​తో దూసుకుపోతోంది. ఈ షోకు ఉన్న క్రేజ్​ను దృష్టిలో పెట్టుకొని.. అందులో పాల్గొనాలని చాలా నటీనటులు అనుకుంటారు. ఈ షోకు ఎంపికైతే తమ.. వ్యక్తిగత, వృత్తిపరమైన జాతకాలు మారిపోతాయని భావిస్తుంటారు. అలా మారిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు.

bigbass couple
లోస్లియా- కవిన్‌

అన్ని భాషల్లో చూసుకుంటే.. ఎన్నో జంటలను కలిపింది బిగ్​బాస్ హౌస్​. చాలా మంది హౌస్​ నుంచి బయటికి వచ్చాక కూడా.. తమ రిలేషన్​షిప్​ను కంటిన్యూ చేశారు. అయితే ఇప్పుడు అలా కంటిన్యూ చేసిన ఓ జంట.. తాజాగా బ్రేక్​ చెప్పేసుకుంది. తమిళ బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయిన జంటల్లో లోస్లియా- కవిన్‌ ఒకటి. తెరపై ఎంతో అన్యోనంగా కనిపించిన ఈ జంట.. బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. తమిళనాడులో న్యూస్‌ రీడర్‌(యాంకర్​)గా లోస్లియా చాలా పాపులర్‌. తాజాగా ఈ విషయంపై లోస్లియా స్పందించింది.

"బిగ్​బాస్ హౌస్​లో ఉన్నప్పుడు నాకు, కవిన్‌కు మధ్య తెలియని ఆకర్షణ ఉన్న మాట నిజమే" అని చెప్పింది లోస్లియా. హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా తాము ప్రేమికులుగా కొనసాగినట్లు పేర్కొంది. అయితే ఈ ప్రయాణంలో తమ లక్ష్యాలు వేరువేరని తెలుసుకున్నట్లు వివరించింది. అందుకే బ్రేకప్​ అనివార్యం అయిపోయిందని చెప్పింది లోస్లియా.

ఇదీ చదవండి:

ఒయ్యారాలొలికే ఈ అమ్మడు ఎంతమందిని 'బ్యాడ్​ బాయ్స్​'గా మార్చిందో!

ఎన్టీఆర్​, రామ్​చరణ్​తో రాఖీ సావంత్ రచ్చ ​- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.