ETV Bharat / entertainment

బాలయ్యకు విలన్​గా ప్రముఖ హీరోయిన్.. శివకార్తికేయన్​కు జోడీగా కియారా!

author img

By

Published : Jun 6, 2022, 9:14 AM IST

అనిల్ రావిపూడి-బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ అంజలి నెగటివ్​ షేడ్స్​ ఉన్న రోల్ చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ కియారా.. తమిళ హీరో శివకార్తికేయన్​తో ఓ మూవీ చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది.

balakrishna kiara
బాలకృష్ణ కియారా

Balakrishna anil ravipudi movie: అనిల్ రావిపూడి-బాలకృష్ణ కాంబోలో ఓ సినిమా త్వరలోనే సెట్స్​పైకి వెళ్లబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన రోజుకో ఆసక్తికరమైన రూమర్​ వస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇందులో బాలయ్య సరసన ప్రియమణిని, కీలక పాత్రలో రవితేజను ఎంపిక చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ రెండు వార్తలపై స్పష్టత రావాల్సి ఉండగా.. తాజాగా మరో కొత్త గాసిప్​ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి నటించబోతుందని.. అయితే ఆ రోల్​ నెగటివ్​ షేడ్స్​లో ఉండబోతుందని తెలిసింది. ప్రతినాయకురాలి పాత్ర అని చెబుతున్నారు. అయితే ఇది నిజమా? కాదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రం తండ్రి, కూతురు చూట్టూ కథ అల్లుకుని ఉంటుందని.. బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా, పెళ్లిసందడి హీరోయిన్​ శ్రీలీలా కూతురిగా నటించనుందని ప్రచారం సాగుతోంది. మాస్​ పాత్రలకు కేరాఫ్ అడ్రస్​ అయిన బాలయ్య ఫుల్​ స్వింగ్​లో ఉండటం, తన కామెడీ మార్క్​ను పక్కన పెట్టి అనిల్​ రావిపూడి సరికొత్త ప్రయోగం చేయబోతుండటం వల్ల.. ఈ కాంబినేషన్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Kiara advani sivakarthikeyan: బాలీవుడ్​ బ్యూటీ కియారా తమిళంలో మరో సినిమాకు ఒకే చెప్పినట్లు తెలిసింది. శివకార్తికేయన్​ హీరోగా మడోన్​ అశ్విన్​ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్​గా ఆమెను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తుందట. ఇప్పటికే కథ కూడా వినిపించారని, ఆమెకు నచ్చి నటించడానికి గ్రీన్ సిగ్నల్​ కూడా ఇచ్చిందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, కియారా ఇప్పటికే శంకర్​ దర్శకత్వంలో రామ్​చరణ్​ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.

ఇదీ చూడండి: ప్రమోషన్స్​లో నయా ట్రెండ్​.. టికెట్​ రేట్లే ప్రధానాస్త్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.