ETV Bharat / entertainment

అట్టహాసంగా 'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్- ట్రైలర్ చూస్తే మెంటలొచ్చిందన్న మహేశ్​! - Animal Pre Release Event ss rajamouli

Animal Pre Release Event : తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ- బాలీవుడ్ స్టార్ రణ్​బీర్ కపూర్ కాంబినేషన్​లో వచ్చిన చిత్రం యానిమల్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. టీజర్​ చూస్తేనే మెంటలొచ్చేసింది అని చెప్పారు. ఇంకే ఏమన్నారంటే?

Animal Pre Release Event
Animal Pre Release Event
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 10:54 PM IST

Updated : Nov 27, 2023, 11:01 PM IST

Animal Pre Release Event : తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్​బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన సినిమా 'యానిమల్'. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో డిసెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లోని మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్​ అట్టాహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్​ బాబు, దిగ్గజ దర్శకుడు ఎస్​ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా వచ్చారు. సినిమా నటీనటులు, టెక్నీషియన్స్​తో పాటు అభిమానులు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. ఒక నాన్ తెలుగు హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ ఇంత మంది రావడం ఇదే తొలిసారి కావచ్చు అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చిస్తున్నారు.

టీజర్ చూస్తే మెంటలొచ్చింది : మహేశ్​
Animal Pre Release Event Mahesh Babu Speech : యానిమల్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్​ బాబు.. సినిమాను పొగిడారు. ముఖ్యంగా మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మెంటలొచ్చిందని చెప్పారు. 'యానిమ‌ల్ ట్రైలర్ చూసాను.. మెంట‌లొచ్చేసింది. ఇలాంటి ఒరిజిన‌ల్ ట్రైల‌ర్ నేనైతే ఎప్పుడూ చూడ‌లేదు. సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. సందీప్ దేశంలోనే ఒరిజినల్ ఫిలిం మేకర్​లలో ఒకరు'' అంటూ కొనిడాడారు. ఈ వేడుక ప్రీరిలీజ్ లా లేదని.. 100రోజుల ఈవెంట్​లా ఉందన్నారు. దేశంలో రణ్​బీర్​ బెస్ట్ నటుడు అని పొగిడేశారు.

స్టేజ్​పై అనిల్ కపూర్ హంగామా!
యానిమల్ సినిమాలో కీలక పాత్ర పోషించిన అనిల్‌ కపూర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాను 43 ఏళ్ల క్రితం తెలుగు సినిమాతో అరంగేట్రం చేశానని.. ఇప్పుడు రెండో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని తెలిపారు. ఇక ఇదంతా తెలుగులో రాసుకొచ్చుకుని మరీ మాట్లాడారు. ఆ తర్వాత మహేశ్‌ బాబు, రణ్​బీర్​ కపూర్​ను వేదికపైకి ఆహ్వానించి డ్యాన్స్‌ చేయమని కోరారు. మహేశ్‌ నవ్వుతూ అనిల్‌ను హగ్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'డీజే టిల్లు- స్క్వేర్​' అప్డేట్​ - రాధిక 'యాంథమ్' రిలీజ్​!

రికార్డులు కొల్లగొడుతోన్న 'భగవంత్ కేసరి'- ఆనందంలో దర్శకుడికి కారు బహుమతి!

Last Updated : Nov 27, 2023, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.