Anand Deverakonda Vaishnavi Movie : టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, నటి వైష్ణవీ చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ జోడీకి సైతం ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సక్సెఫుల్ జోడీ మరోసారి తెరపై మెరవబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ సినిమా పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.
'3 రోజెస్' వెబ్‌సిరీస్‌కు రచయితగా, 'ప్రతిరోజూ పండగే' సినిమాకు కో రైటర్, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన రవి నంబూరి.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. కాగా, ఈ సినిమాకు బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్.. కథ అందించారు. ఈ విషయాన్ని దర్శకుడు సాయి రాజేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'కల్ట్ కాంబో ఈజ్ బ్యాక్. చిత్రానికి కథ రాసింది నేనే. నా మిత్రుడు రవి నంబూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు' అని రాసుకొచ్చారు. ఈ సినిమాను 'బేబీ' నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసి సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. ఇక సినిమాను 2024 సమ్మర్లో విడుదల చేయనున్నట్లు మూవీయూనిట్ తెలిపింది.
-
We’re back.
— Anand Deverakonda (@ananddeverkonda) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A classic love story… ❤️
Summer 2024 release.
Super glad to be working with the blockbuster combo producers @MassMovieMakers X #amruthaproductions
And we’ll be working again with the core team of #babythemovie - looking forward to create something amazing with… pic.twitter.com/N1SHtcUC9d
">We’re back.
— Anand Deverakonda (@ananddeverkonda) October 20, 2023
A classic love story… ❤️
Summer 2024 release.
Super glad to be working with the blockbuster combo producers @MassMovieMakers X #amruthaproductions
And we’ll be working again with the core team of #babythemovie - looking forward to create something amazing with… pic.twitter.com/N1SHtcUC9dWe’re back.
— Anand Deverakonda (@ananddeverkonda) October 20, 2023
A classic love story… ❤️
Summer 2024 release.
Super glad to be working with the blockbuster combo producers @MassMovieMakers X #amruthaproductions
And we’ll be working again with the core team of #babythemovie - looking forward to create something amazing with… pic.twitter.com/N1SHtcUC9d
'చాంగురే బంగారు రాజా' ఓటీటీ.. కామెడీ క్రైమ్ జానర్లో తెరకెక్కిన 'చాంగురే బంగారు రాజా' చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్ వేదికగా అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ ఆర్టీ (RT) ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించారు. సతీష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక సెప్టెంంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కేరాఫ్ కంచరపాలెం మూవీ ఫేమ్.. కార్తీక్ రత్నం హీరోగా నటించగా, రవిబాబు, సత్య, అజయ్, ఎస్తర్, నిత్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
-
Get ready for immense fun & thrill with #ChangureBangaruRaja Teaser Tomorrow 😎❤️🔥 pic.twitter.com/giJqcyp6LE
— ETV Win (@etvwin) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Get ready for immense fun & thrill with #ChangureBangaruRaja Teaser Tomorrow 😎❤️🔥 pic.twitter.com/giJqcyp6LE
— ETV Win (@etvwin) October 20, 2023Get ready for immense fun & thrill with #ChangureBangaruRaja Teaser Tomorrow 😎❤️🔥 pic.twitter.com/giJqcyp6LE
— ETV Win (@etvwin) October 20, 2023
Baby movie chiranjeevi : 'అది చూసి ఆశ్చర్యపోయా.. నా వల్ల కాలేక మూడు రోజులు బయటకు రాలేకపోయా'
Baby Movie OTT : 4గంటల రన్టైమ్తో ఓటీటీలోకి 'బేబీ'.. ఆ సీన్స్ అన్నీ యాడ్!