ETV Bharat / entertainment

కలెక్షన్లలో దూసుకెళ్తున్న 'బేబీ'.. తొమ్మిది రోజుల్లోనే ఇన్ని కోట్లా? - బేబీ మూవీ లేటెస్ట్ న్యూస్​

Baby Movie Day 9 Collections : ఇటీవలి కాలంలో విడుదలై యూత్​ను ఆకట్టుకున్న బేబీ మూవీ అటు కంటెంట్​తో పాటు ఇటు కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా తొమ్మిదో రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే ?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 23, 2023, 4:37 PM IST

Updated : Jul 23, 2023, 5:48 PM IST

Baby Movie Day 9 Collections : ఇటీవలి కాలంలో విడుదలైన 'బేబీ' మూవీ అందరి అంచనాలను దాటుకుని బాక్సాఫీస్​ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్​ ఆనంద్​ లీడ్​ రోల్స్​లో రూపొందిన ఈ చిత్రం గురించే ఇప్పుడు నెట్టింట టాక్​ నడుస్తోంది. 'కలర్‌ఫోటో' ఫేమ్​ సాయి రాజేశ్​ దర్శకత్వంలో ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ సినిమా జులై 14న థియేటర్లలో రిలీజైంది.

అయితే విడుదలైనప్పటి నుంచి అటు కంటెంట్​ పరంగనే కాకుండా ఇటు కలెక్షన్ల పరంగానూ ట్రెండ్​ సృష్టిస్తోంది. థియేటర్లు సైతం హౌస్​ఫుల్​తో దర్శనమిస్తోంది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, పాటలతో అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్​ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుని దూసుకెళ్తోంది. ఇక తాజాగా ఈ సినిమా మరో మైల్​స్టోన్​ను దాటుకుంది.

Baby Movie Collections : తొలి రోజే రూ.7.1 కోట్లు వరకూ కలెక్షన్స్‌ వసూలు​ చేసిన ఈ సినిమా.. రెండో రోజు రూ. 7.2 కోట్లు రాబట్టి.. మంచి టాక్​తో దూసుకెళ్లింది అలా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లోనే రూ. 60.3 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని దర్శకుడు సాయిరాజేష్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ఇప్పటి కాలంలో విడుదలైన చిన్న సినిమాల్లో వేగంగా హాఫ్ సెంచరీ కొట్టిన సినిమాగా బేబీ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. సుమారు 7.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన 'బేబి'… మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యి లాభాల్లోకి ఎంట్రీ అయినట్లు ట్రేడ్​ వర్గాల టాక్​. అయితే రెండో వారంలోనూ బేబీ ఇదే ఊపు మీద ఉండేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే బేబీ సినిమా ఓవరాల్ గా 65-70 కోట్ల గ్రాస్ వసూల్ చేసే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు గుసుగుసలాడుతున్నాయి​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అంత తక్కువనా?
Baby Remuneration : ఇప్పటి కాలంలో తక్కువ బడ్జెట్​తో తెరకెక్కి కోట్లు రాబట్టిన ఈ సినిమా.. కలెక్షన్ల పరంగా టాక్​ ఆఫ్​ ద టౌన్​గా మారింది. అయితే తాజాగా ఇందులోని సినిమా స్టార్స్ రెమ్యూనరేషన్​ విషయం గురించి నెట్టింట ఓ వార్త హల్​ చల్​ చేస్తోంది. అదేంటంటే.. హీరో ఆనంద్‌ దేవరకొండ ఈ సినిమా కోసం రూ.80 లక్షల మేర పారితోషకాన్ని అందుకున్నారట. ఇక హీరోయిన్‌ వైష్ణవి చైతన్య రూ.30లక్షలు.. మరో హీరో విరాజ్‌ రూ.25 లక్షల వరకు తీసుకున్నారట. అయితే దర్శకుడు సాయి రాజేష్​ మాత్రం ఈ సినిమా కోసం కోటికి పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారట.

Last Updated : Jul 23, 2023, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.