ETV Bharat / entertainment

'బిగ్​ బీ ఈజ్​ బ్యాక్'​.. సెట్స్​లో అమితాబ్​.. అది కదా డెడికేషన్​ అంటే! - అమితాబ్​ బచ్చన్ తిరిగి షూటింగ్​కు

ప్రాజెక్ట్​-కె మూవీ షూటింగ్​లో గాయపడిన బాలీవుడ్​ దిగ్గజం అమితాబ్​ బచ్చన్ కోలుకున్నారు. ఆయన తిరిగి సెట్స్​లోకి వచ్చారు. అందుకు సంబంధించిన చిత్రాలను ఆయన షేర్​ చేశారు.

Amitabh bhachchan back to work on Project k Cinema
గాయం నుంచి కోలుకున్న అమితాబ్​ బచ్చన్ తిరిగి షూటింగ్​కు
author img

By

Published : Apr 5, 2023, 4:39 PM IST

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ అభిమానులకు గుడ్​న్యూస్​! ప్రాజెక్ట్​-కె సినిమా షూటింగ్​లో భాగంగా గాయపడిన అమితాబ్​.. కోలుకున్నారు. దీంతో మళ్లీ షూటింగ్​లో పాల్గొనేందుకు సెట్స్​లోకి వచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆయనే స్వయంగా తన బ్లాగ్​లో పోస్ట్​ చేశారు.

సినిమా సెట్​కు సంబంధించిన పలు ఫొటోలతో పాటు తాను మేకప్​ వేసుకుంటున్న ఓ చిత్రాన్ని కూడా అమితాబ్​ షేర్​ చేశారు. క్యాప్షన్​గా 'ఆఫ్​ టు వర్క్​'(నేను తిరిగి పనిలోకి వచ్చాను) అంటూ మూవీకి సంబంధించిన కొన్ని వివరాలను కూడా రాసుకొచ్చారు. ఓ ఫొటోలో బిగ్​ బీ మూవీ టీమ్​​తో చర్చిస్తున్నట్లు కనిపించింది. ఈ చిత్రాలు చూసిన ఫ్యాన్స్​.. హ్యాపీగా ఫీలవుతున్నారు.

80 ఏళ్ల వయసులోనూ అమితాబ్​ బచ్చన్​కు సినిమాల పట్ల ఉన్న డెడికేషన్​ చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! సెట్స్​లో ఆయన ఎంతో ఎనర్జిటిక్​గా కనిపిస్తుంటారు. సాధారణంగా ఆదివారం సమయాల్లో తన ఫ్యాన్స్​తో రెగ్యులర్​గా మీట్​ అవుతుంటారు అమితాబ్​. కానీ​ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొన్ని వారాల పాటు వాటిని రద్దు చేసుకున్నారు.

Amitabh bhachchan back to work on Project k Cinema
గాయం నుంచి కోలుకున్న అనంతరం తిరిగి షూటింగ్​లో పాల్గొన్న అమితాబ్​ బచ్చన్​.

పాన్​ ఇండియా​ స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న ప్రాజెక్ట్​-కె చిత్రంలోని పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్​ గాయపడ్డారు. మార్చి 4న జరిగిన ఈ ఘటనలో అమితాబ్ కుడి పక్కటెముక విరిగడంతో పాటు కండరం దెబ్బతింది. దీంతో ఆయన హైదరాబాద్​లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ముంబయిలోని తన స్వగృహానికి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు కొన్ని వారాల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. గాయం దాదాపు నయం కావడంతో ఆయన తిరిగి సినిమా షూటింగ్​లో కనిపించారు. ఈ చిత్రంలో బాలీవుడ్​ భామ దీపికా పదుకొణె హిరోయిన్​గా నటిస్తోంది.

బాలీవుడ్​ బిగ్​ బీ అమితాబ్​ బచ్చన్​ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ కనువిందు చేయనుంది. మహానటి దర్శకుడు నాగ్​ అశ్విన్​ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్​లో సుదీర్ఘమైన అయిదు యాక్షన్‌ బ్లాకులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాజెక్ట్​-కె సినిమా రిలీజ్​ డేట్​ను చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఏమైందో కానీ..!
ఈ సినిమాలో ముందుగా మిక్కీ జె మేయర్‌ను మ్యూజిక్​ డైరెక్టర్​గా తీసుకున్నారు. కానీ పలు కారణాలతో ఆయన స్థానంలో సంతోష్‌ నారాయణన్​కు బాధ్యతలు అప్పగించారు మేకర్స్​. ప్రముఖ హిందీ దర్శకుడు రిభు దర్శకత్వంలో రాబోతున్న 'సెక్షన్ 84'లోనూ అమితాబ్​ బచ్చన్​ నటించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.