Amala Paul Latest News: ప్రముఖ నటి అమలాపాల్ లైంగిక వేధింపులకు గురైనట్టు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రైవసీ ఫొటోలను బహిర్గతం చేస్తానంటూ ఆమె మాజీ ప్రియుడు భవ్‌నిందర్ సింగ్ దత్ బెదిరిస్తున్నాడని ఆమె విల్లుపురం పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అమల ఫిర్యాదు మేరకు భవ్‌నిందర్‌తోపాటు ఆయన సహచరులైన మరో 11 మందిపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. తాజాగా భవ్‌నిందర్‌ను అరెస్ట్ చేయగా మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని కోలీవుడ్ మీడియా పేర్కొంది.
అమలాపాల్, గాయకుడైన భవ్‌నిందర్ ఒకప్పుడు మంచి స్నేహితులు. విడాకులు తీసుకున్న అనంతరం అమల.. భవ్‌నిందర్‌తో డేటింగ్‌లో ఉందని, పెళ్లి కూడా చేసుకుంటుందని అప్పట్లో వార్తలొచ్చాయి. వీరిద్దరూ 2018లో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. నిర్మాతగా ఈ ప్రొడక్షన్ హౌజ్ కోసం అమల భారీ మొత్తాన్ని వెచ్చించారు. మనస్పర్థల కారణంగా ఇద్దరూ దూరమయ్యారని, కంపెనీ డైరెక్టర్‌గా అమలాపాల్‌ను తొలగిస్తూ భవ్‌నిందర్ నకిలీ పత్రాలు సృష్టించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమల.. భవ్‌నిందర్‌ను అడగ్గా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడట. 'ప్రేమఖైదీ' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అమల 'బెజవాడ'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' తదితర తెలుగు సినిమాలతో మెప్పించారు.
ఇవీ చదవండి: పవన్ కల్యాణ్ 'జల్సా' రీరిలీజ్.. కొత్త ట్రైలర్ ఇదిగో...