ETV Bharat / entertainment

చిరంజీవి, సురేఖ పెళ్లి వెనక జరిగిన ఈ కథ తెలుసా - చిరంజీవి సురేఖ పెళ్లి వీడియో

Chiranjeevi Surekha marriage టాలీవుడ్​లోని అన్యోన్య దంపతుల్లో మెగాస్టార్​ చిరంజీవి, సురేఖ జోడి ఒకటి. అయితే తాజాగా వీరిద్దరి పెళ్లినాటి సంగతుల గురించి ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ సంగతులు చూద్దాం.

Chiranjeevi Surekha marriage
చిరు సురేఖ పెళ్లి
author img

By

Published : Aug 24, 2022, 11:28 AM IST

Chiranjeevi Surekha marriage మెగాస్టార్‌ చిరంజీవి టాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. 1978లో పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన తనదైన నటన, డ్యాన్స్​ స్టెప్పులతో మెగాస్టార్​గా ఎదిగారు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలోనే ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరి పెళ్లినాటి సంగతుల గురించి ఓ వీడియో బయటకు వచ్చింది.

చిరంజీవికి, ఆయన సతీమణి సురేఖతో పెళ్లి ఎలా జరిగింది? పెళ్లి చూపులు ఎక్కడ జరిగాయి? ఈ విషయాలపై సురేఖ సోదరుడు, నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "ఇప్పుడంటే సినిమావాళ్ళకు అమ్మాయిని ఇవ్వడానికి గొప్పగా ముందుకు వస్తున్నారు. కానీ అప్పట్లో సినిమా వాళ్లకు అమ్మాయిని ఇవ్వడం అనేది పెద్ద ప్రశ్న. మా నాన్నగారు అల్లు రామలింగయ్యగారికి, డివిఎస్ రాజు అంటే గురుభావం ఉండేది. ఆయన దగ్గరికెళ్లి చిరంజీవి గురించి మాట్లాడటానికి వెళ్ళాం. మా నాన్నగారు మాట్లాడుతూ.. 'మీకు చిరంజీవి తెలుసు కదా.. ఆయన గురించి కనుకున్నాం. చాలా మంచివాడని, ఏ దురలవాట్లు లేవని తెలుసుకున్నాం. కానీ మనమ్మాయిని ఓ ఫిలిం యాక్టర్​కు ఇవ్వాలా? అనే సందేహంతో వచ్చామని డివిఎస్ రాజుతో అన్నారు. ఆ వెంటనే రాజు స్పందిస్తూ.. మీరూ, మీ అబ్బాయి సినిమావాళ్లు కాదా? అసలు మనం అలా ఆలోచించకూడదు. మీకు అబ్బాయి నచ్చాడు.. దురలవాట్లు లేవు.. మనం అమ్మాయిని ఇవ్వాలని మా నాన్నగారికి చెప్పారు. ఆ తర్వాత నేను, జయకృష్ణ, హరిబాబు కలిసి సంబంధం అడగడానికి నెల్లూరులో చిరంజీవి ఇంటికి వెళ్ళాం. అయితే అప్పటికీ చిరంజీవి పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఓ మూడేళ్ళ తర్వాత చేసుకుందాం అనుకున్నారట. మ్యారేజ్ అయ్యాక ఓ ఏడాదిన్నర పాటు మా ఇద్దరి మధ్య రిలేషన్​షిప్​ మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఫ్రెండ్​షిప్​ మొదలై క్లోజ్ అయ్యాం." అంటూ నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు అల్లు అరవింద్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

చిరంజీవి, సురేఖ పెళ్లి

ఇదీ చూడండి: కమల్​హాసన్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​, ఆగిపోయిన సినిమా షూటింగ్​ షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.