ETV Bharat / entertainment

అల్లుఅర్జున్​-రామ్​చరణ్​ కాంబోలో మల్టీస్టారర్.. టైటిల్ ఫిక్స్

రామ్​చరణ్​-అల్లుఅర్జున్​ కాంబోలో మల్టీస్టారర్​ సినిమా తెరకెక్కించే విషయమై మాట్లాడారు నిర్మాత అల్లుఅరవింద్​. ఏమన్నారంటే..

Alluarjun multistarrer movie
బన్నీ-చెర్రీ మల్టీస్టారర్​ మూవీ.. టైటిల్ ఫిక్స్
author img

By

Published : Oct 18, 2022, 3:34 PM IST

బన్నీ-చెర్రీ మల్టీస్టారర్​ మూవీ.. టైటిల్ ఫిక్స్

తమ అభిమాన హీరోలు కలిసి మల్టీస్టారర్​ సినిమా చేస్తే ఫ్యాన్స్​కు​ వచ్చే ఆ కిక్కే వేరు. అలాంటి క్రేజీ కాంబినేషన్స్​లో రామ్​చరణ్​-అల్లుఅర్జున్​ ఒకటి. వారిద్దరు కలిసి నటిస్తే చూడాలనేది మెగా అభిమానుల కోరిక. అయితా అదే కోరిక తనుకు కూడా ఉందని ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్​ తెలిపారు. త్వరలోనే వారిద్దరితో కలిసి మల్టీస్టారర్​ చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని చెప్పారు.

'మీ బ్యానర్‌లో ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరు?మీరు తీసిన అన్ని సినిమాల్లో మీకు తృప్తిని ఇచ్చిన సినిమా ఏది?' అని అలీ అడగగా ఈ విషయాన్ని చెప్పారు. "మా బ్యానర్‌లో ఎక్కువ సినిమాలు చేసింది కచ్చితంగా చిరంజీవిగారే. తీసిన అన్ని సినిమాలు దాదాపు హిట్లే. నా జీవితంలో ఒక బ్రహ్మాండమైన సినిమా తీశాను అన్న తృప్తి ‘మగధీర’ ఇచ్చింది. మా బ్యానర్‌లో బన్నీ, చరణ్‌ కలిసి పనిచేస్తే బాగుంటుంది. అది నా కోరిక. 10 ఏళ్ల క్రితమే దానికి 'చరణ్‌-అర్జున్‌' అనే పేరు కూడా పెట్టుకున్నా. ఎప్పటికైనా జరుగుతుందని నాకు ఆశ ఉంది" అని అల్లుఅరవింద్​ చెప్పుకొచ్చారు.

ఇక ఇదే కార్యక్రమంలో.. 'పుష్ప సినిమా విజయం చూసి ఒక తండ్రిగా ఏమనిపించింది' అని అడగగా.. "పుష్ప సినిమా బన్నీకి, నాకు ఇద్దరికీ ఒక మైల్‌స్టోన్‌ లాంటిది. నా కొడుకు నేషనల్‌స్టార్‌ అయ్యాడు. దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇవ్వన్నీ చూస్తే చాలా తృప్తిగా ఉంటుంది. అల్లు అర్జున్‌ చిన్నప్పటి నుంచి డ్రాయింగ్‌ బాగా వేస్తాడు. ఒకసారి కెనడాలో ఓ యానిమేషన్‌ స్కూల్‌లో సీటు కోసం అప్లై చేశాడు. దాని కోసం 13 గంటలు కూర్చుని డ్రాయింగ్స్‌ వేసి పంపాడు. ఏదైనా పని మొదలు పెడితే అంత నిబద్ధతతో చేస్తాడు. ఆ ఏకాగ్రత పుష్ప సినిమాకు బాగా ఉపయోగపడింది. ఆ సినిమాలోని పాత్రకు మేకప్‌ వేసుకోవడం కోసం బన్నీకి 2 గంటలు పట్టేది. అడవిలోకి వెళ్లి షూటింగ్‌ చేయాలి. అక్కడకు వెళ్లాలంటే మరో 2 గంటలు పట్టేది. అంటే 4 గంటలు ముందే అల్లు అర్జున్‌ రెడీ అవ్వాలి. అయినా ఏ మాత్రం విసుగు లేకుండా చేస్తాడు. సినిమాలు కానీ చేసే పని ఏదైనా కానీ అంత తపనతో చేస్తాడు" అని అరవింద్​ తెలిపారు.

'మీరు మరికొందరు నిర్మాతలతో కలిసి రామాయణం తీస్తున్నారట నిజమేనా'? అని అడగగా.. "అల్లు అరవింద్‌: అవును, దాని కోసం గత నాలుగు సంవత్సరాలుగా పనులు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాటి తర్వాత ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రయత్నం అంతా పూర్తవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ, ఆ సినిమా వస్తే అది భారతదేశంలోనే అతి పెద్ద, అతి భారీ బడ్జెట్‌ సినిమాగా నిలిచిపోతుంది" అని వెల్లడించారు.

ఇదీ చూడండి: రాజమౌళి-మహేశ్​ సినిమాలో ఛాన్స్​ కొట్టేసిన దీపికా పదుకొణె!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.