ETV Bharat / entertainment

అర్హ ముద్దు ముద్దు మాటలు.. వీడియో షేర్ చేసిన ఐకాన్ స్టార్​ - అల్లుఅర్జున్​ శాకుంతలం

తన గారాల కుమార్తె అర్హ ముద్దు ముద్దు మాటలకు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ మురిసిపోయారు. అర్హ పుట్టినరోజు పురస్కరించుకుని సోమవారం ఆయన ఓ వీడియో షేర్‌ చేశారు.

Allu arha cute video
అర్హ ముద్దు ముద్దు మాటలు.. వీడియో షేర్ చేసిన ఐకాన్ స్టార్​
author img

By

Published : Nov 21, 2022, 4:00 PM IST

షూటింగ్​లో ఎంత బిజీగా ఉన్నా తీరిక దొరికితే చాలు పిల్లలతో గడిపేందుకు సమయం కేటాయిస్తుంటారు హీరో అల్లు అర్జున్. ఆ ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లోనూ పంచుకుని తన ప్రేమను తెలియజేస్తుంటారు. తాజాగా తన గారాల కుమార్తె అర్హ ముద్దు ముద్దు మాటలకు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ మురిసిపోయారు.

అర్హ పుట్టినరోజు పురస్కరించుకుని సోమవారం ఆయన ఓ వీడియో షేర్‌ చేశారు. ఇందులో ఆమె.. తమ నివాసంలో కందిరీగలు ఉన్నాయని, అవి దాడి చేశాయని.. కంగారుపడుతూ ముద్దు ముద్దుగా చెబుతూ కనిపించింది. ఆమె మాటలకు ఆనందించిన బన్నీ.. 'ఎందుకు అంత భయపడుతున్నావ్‌?' అని ప్రశ్నించగా.. 'ఎందుకంటే అవి కుడుతున్నాయ్‌. ఇన్ని ఉన్నాయ్‌' అంటూ వచ్చీరానీ మాటలతో సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. అర్హకు సంబంధించిన క్యూట్‌, ఫన్నీ వీడియోలను బన్నీ అప్పుడప్పుడూ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంటారనే విషయం తెలిసిందే. మరోవైపు, గుణ శేఖర్‌ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం'తో అర్హ వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వనుంది. మరోవైపు ఈ చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 'శాకుంతలం' చిత్రబృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి: 'వారిసు' రిలీజ్ వివాదం.. ​టాలీవుడ్​ నిర్మాతల మండలి కీలక వ్యాఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.