Allu arha remuneration : సినీ ఇండస్ట్రీలోకి స్టార్ కిడ్స్ రావడం సహజమే. ఇప్పటికే పలువురు హీరోల పిల్లలు.. పెద్ద కాకముందే చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. వీరిలో.. అల్లు అర్జున్, రవితేజ, మహేశ్ బాబు, సుధీర్‌బాబు సహా ఇతర హీరోల పిల్లలు ఉన్నారు. 'రాజా ది గ్రేట్'లో రవితేజ కొడుకు, 'విన్నర్', 'భలే భలే మగాడివోయ్'లో సుధీర్ బాబు కొడుకు, 'శాకుంతలం'లో అల్లుఅర్జున్ కూతురు, 'సర్కారు వారి పాట'లో మహేశ్ బాబు కూతురు కనిపించి తమ నటనతో ఆకట్టుకున్నారు. అలరించారు.
సితార తర్వాత అల్లు అర్హ.. అయితే ఈ స్టార్ కిడ్స్ అందరిలో మహేశ్ కూతురు సితారకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న చిన్నారి అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ. సోషల్‌మీడియాలోనూ మంచి ఫాలోయింగ్‌ను అందుకుంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత నటించిన 'శాకుంతలం' సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో భరతుడిగా నటించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన ముద్దులొలికే మాటలతోనే చిన్నారి భరతుడి రాజసాన్ని ప్రతిబింబించేలా నటించింది.
ఇప్పుడు 'దేవర' కోసం.. అయితే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'దేవర'లో కనిపించనుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ జాన్వీకపూర్ చిన్నప్పటి పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే తాజాగా మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో అల్లు అర్హ నటించేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వచ్చే నెలలో ఈ చిన్నారి పాత్రకు సంబంధించిన షూటింగ్ చేస్తారట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నిమిషానికి రూ.2 లక్షలు.. ఇందులో ఆమె పాత్ర నిడివి 10 నిమిషాలు ఉండనుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పది నిమిషాలకు గానూ ఈ చిన్నారికి రూ.20 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అంటే ఒక్కో నిమిషానికి రెండు లక్షలు అన్నమాట. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించిన కథనాలు బయట వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు.. ఇప్పటికే 'శాకుంతలం'లో క్యూట్ డైలాగ్స్‌తో అచ్చ తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడి బాగా ఆకట్టుకుంది... మరి దేవరలో ఎలా చేస్తుందో చూడాలి అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్హత ఘనత.. ఇకపోతే ఆ మధ్య కాలంలో అల్లు అర్హ ఓ ఘనత కూడా సాధించింది. నాలుగేళ్లకే నోబుల్ బుక్ అవార్డును అందుకుంది. అలా ప్రపంచంలోనే పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్‌గా ఘనత సాధించింది. మొదట చెస్‌పై అర్హను ఆసక్తిని గమనించిన అల్లు అర్జున్ కుటుంబం..ఆమెను ఓ చెస్ అకాడమీలో ట్రైనింగ్ ఇప్పించారు. ఆ సమయంలో అర్హ.. కేవలం తాను మాత్రమే నేర్చుకోకుండా ఇతరులకు కూడా నేర్పించింది. అలా రెండు నెలల వ్యవధిలోనే 50 మందికి పైగా శిక్షణ ఇచ్చింది. దీంతో అర్హ ప్రతిభను గుర్తించిన నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ ప్రతినిధులు అర్హకు ఓ పరీక్ష పెట్టగా.. అందులో ఆమె నెగ్గి.. 'వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్' అవార్డును ముద్దాడింది.
ఇదీ చూడండి :
Shaakuntalam movie : అల్లు అర్హ యాక్టింగ్‌పై ఆడియెన్స్ టాక్.. ఏమంటున్నారంటే?