Allu Arjun In Vijetha Movie : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీలో బిజీగా ఉన్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఎలాంట్ అప్డేట్లు రాట్లేదు. బహుశా ఇప్పట్లో రాకపోవచ్చు కూడా. తాజాగా అల్లుఅర్జున్ సడెన్‌గా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఎవరికీ తెలియని విషయాన్ని బయటపెట్టారు.
ఇంతకీ ఏం జరిగింది?
తండ్రి అల్లు అరవింద్ స్వతహగా నిర్మాత కావడంతో చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ సినిమా వాతావరణంలోనే పెరిగారు. అయితే బన్నీ రెండేళ్ల వయసులో ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి విజేత మూవీలో నటించారు. దీని గురించి ఫ్యాన్స్‌కు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తాజాగా ఈ సినిమా షీల్డ్‌తో అల్లు అరవింద్ ఉన్న ఫొటోను బన్నీ పోస్ట్ చేశారు. ఓ ఫన్నీ విషయాన్ని రివీల్ చేశారు.
'డబ్బులు ఇవ్వలేదు'
'నా తొలి సినిమా విజేత, మై ప్రొడ్యూసర్(నాన్న), ఓ మైగాడ్. ఇందులో యాక్ట్ చేసినందుకు డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు మళ్లీ గుర్తొచ్చింది' అని అల్లు అర్జున్ ఇన్ స్టాలో స్టోరీ పెట్టారు. అయితే ఇదంతా ఫన్నీగా ఉండటంతో నెటిజన్స్ కూడా నవ్వుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ తండ్రి డబ్బులు ఎగ్గొట్టేశాడని బన్నీపెట్టిన స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ఫుల్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. బన్నీ అన్నకు రెమ్యునరేషన్ ఇచ్చేయాలి అప్పుడే కదా సర్ అంటూ సందడి చేస్తున్నారు.
కోదండరామి రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, భానుప్రియ హీరోహీరోయిన్లుగా 1985లో విజేత చిత్రం రిలీజ్ అయింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో మంచి హిట్ అయింది. ఈ సినిమాతోనే తెరంగేట్రం చేశారు అల్లు అర్జున్. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్వాతిముత్యంలో నటించారు. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు డాడీలో అతిథి పాత్రలో కనిపించారు.
ఆ తర్వాత 2003తో గంగోత్రితో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా చాలా బ్లాక్‍బాస్టర్లు కొట్టి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం పుష్ప-2తో బిజీగా ఉన్నారు బన్నీ. బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన పుష్పకు సీక్వెల్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలోని నటనకుగానూ ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు హీరోగా నిలిచారు.
ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా దర్శకుడు సుకుమార్ పుష్ప2ను తీర్చిదిద్దుతున్నారు. జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో అల్లు అర్జున్ గంగమ్మ తల్లిగా కనిపించడం సినిమాకే హైలైట్ ఉంటుందని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. అర్జున్ పెర్ఫామెన్స్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు.ఈ సినిమా 2024 ఆగస్టు 15న విడుదల కానుంది.
బన్నీ ఇంటికి 'పుష్ప' టీమ్... అల్లు అర్జున్ను చూడగానే సుక్కు ఎమోషనల్
మెగా ప్రిన్సెస్ క్లీంకారకు అల్లుఅర్జున్ కాస్ట్లీ గిఫ్ట్.. బంగారు పలకపై..