ETV Bharat / entertainment

ఆసక్తిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ట్రైలర్​.. ఫన్నీగా 'నేను స్టూడెంట్​ సర్' టీజర్​ - నేను స్టూడెంట్​ సర్ టీజర్​

Movie Updates: కొత్త సినిమా అప్డేట్లు వచ్చేశాయి. అల్లరి నరేశ్​ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా ట్రైలర్​ను చిత్రబృందం రిలీజ్​ చేసింది. మరోవైపు, బెల్లంకొండ గణేశ్​ 'నేను స్టూడెంట్‌ సర్‌' టీజర్​ను మేకర్స్​ రిలీజ్​ చేశారు.

movie updatesallari-naresh-movie-itlu-maredumilli-prajaneekam and nenu student sir-trailer-out-today

author img

By

Published : Nov 12, 2022, 10:36 PM IST

Updated : Nov 12, 2022, 10:50 PM IST

Itlu Maredumilli Prajaneekam Trailer: అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌ కెరీర్‌లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం.

ట్రైలర్ విషయానికొస్తే.. 'ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ మీ ఊర్లో జరగబోతున్నాయి' అనే అల్లరి నరేశ్ డైలాగ్‌తో ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్‌ లుక్ పోస్టర్‌కు ఫ్య్సాన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఎన్నికల నిర్వహణకు ఓ మారుమూల పల్లెలో గిరిజన ప్రజలు నివసించే మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే అధికారి పాత్రలో అల్లరి నరేశ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్‌ 25న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Nenu Student Sir Teaser: సాధారణంగా ఏదైనా వస్తువు పోతే, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం. కానీ, యువ కథానాయకుడు బెల్లకొండ గణేశ్‌ ఏకంగా పోలీస్‌స్టేషన్‌పైనే కంప్లెయింట్‌ చేశాడు. ఆయన కీలక పాత్రలో రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'నేను స్టూడెంట్‌ సర్‌'. అవంతిక దస్సాని కథానాయిక. శనివారం ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్‌ విడుదల చేశారు.

తాను ఎంతో కష్టపడి రూ.89,999 పెట్టి కొనుకొన్న ఐఫోన్‌ పోవటానికి పోలీసులే కారణం అంటూ బెల్లకొండ గణేశ్‌ కమీషనర్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ ఫోన్‌ ఎలా పోయింది? అందులో పోలీసుల పాత్ర ఏంటి? చివరకు ఆ ఫోన్‌ దొరికిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మహతి స్వరసాగర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు..

Meet Cute Teaser Release: నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్లో ఓ సరికొత్త వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు సినిమాలను నిర్మించిన నాని.. ఇప్పుడు 'మీట్ క్యూట్' అనే విభిన్న ఆంథాలజీ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఐదు విభిన్న కథల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌కు నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఈ టీజర్‌ను గమనిస్తే ఆద్యందం ఆసక్తికరంగా సాగింది. నటీనటుల మధ్య వచ్చే సంభాషణలు, అందుకు అనుగుణంగా వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనసును హత్తుకునేలా ఉంది. సింపుల్‌గా క్యూట్‌గా ఉన్న ఈ టీజర్.. సిరీస్‌పై అంచనాలను పెంచేసింది. చివర్లో అనుబంధాలు విఫలమయ్యేది ఈ చిన్న చిన్న గొడవల వల్ల కాదు.. గొడవ పడటం మానేసినప్పుడే అవి ఫెయిలవుతాయి అని సత్యరాజ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఐదు ఎపిసోడ్స్‌తో సాగే ఈ సిరీస్‌కు నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించారు. సోని లివ్ వేదికగా త్వరలో ఈ ఆంథాలజీ సిరీస్ ప్రసారం కానుంది.

Last Updated : Nov 12, 2022, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.