Alia ranbir kapoor marriage: బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మరి కొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. వీరి వివాహనికి సంబంధించిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుక.. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబయిలోని రణ్‌బీర్ నివాసం 'వాస్తు'లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ వేడుక సందడిగా జరిగింది. దీనికి బాలీవుడ్ బ్యూటీస్ కరీష్మాకపూర్, కరీనకపూర్ సహా ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు, ఇతర బాలీవుడ్ ప్రముఖులు తరలి వచ్చారు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు,వీడియోలు లీక్ అవ్వకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అందుకే ఎవరి ఫొటోలు బయటకు రావట్లేదు.
43 ఏళ్ల క్రితం రణ్‌బీర్ తల్లిదండ్రులు నీతూ కపూర్, రిషి కపూర్‌ల నిశ్చితార్థం జరిగిన రోజునే వీరి మెహందీ వేడుక జరగడం మరో విశేషం. ఈ సందర్భంగా తన నిశ్చితార్థం ఫొటోను నీతూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇక ఈ జంట పెళ్లి కోసం.. అభిమానులతోపాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పెళ్లి నేపథ్యంలో అభిమానులు కూడా తమ స్టార్స్ కోసం.. ప్రత్యేకమైన గిఫ్ట్స్ కూడా పంపుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి:
రణ్‌బీర్- ఆలియా పెళ్లికి రాయల్ గిఫ్ట్ - 125 బంగారు పూలతో..