ETV Bharat / entertainment

రష్మిక 'క్రష్​ క్లబ్'​లో చేరిన ఆలియా భట్- 'యానిమల్' హీరోయిన్ రియాక్షన్ ఏంటో తెలుసా? - యానిమల్ సినిమా హీరోయిన్

Alia Bhatt About Rashmika Mandanna : తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సినిమా 'యానిమల్'. ఈ సినిమాలో​ హీరోయిన్​గా నటించిన రష్మిక మందన్నను ప్రముఖ బాలీవుడ్ కథానాయిక ఆలియా భట్​ ప్రశంసించారు. దీంతోపాటు రష్మిక క్రష్​ క్లబ్​లో తాను జాయిన్ అవుతున్నానని చెప్పారు. ఆ వివరాలు మీకోసం.

Alia Bhatt About Rashmika Mandanna
Alia Bhatt About Rashmika Mandanna
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 5:25 PM IST

Updated : Dec 2, 2023, 5:53 PM IST

Alia Bhatt About Rashmika Mandanna : బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్, 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న లీడ్​ రోల్​లో టాలీవుడ్​ డైరెక్టర్ సందీప్​ రెడ్డి వంగ తెరకెక్కిన సినిమా 'యానిమల్'. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి రోజు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీసు ముందు దూసుకెళ్తోంది. అయితే 'యానిమల్' సక్సెస్​పై ప్రముఖ బాలీవుడ్ నటి, రణ్​బీర్ కపూర్ భార్య ఆలియా భట్​ స్పదించారు. సినిమాలో రణ్​బీర్​ కపూర్​ భార్యగా నటించిన రష్మికను ఆలియా ప్రశంసించారు.

'రష్మిక మందన్న మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. నేను మీమ్మల్ని కలిసినప్పుడు ఏం చెప్పానో అలాగే ఉన్నారు. ఆ సీన్​లో మీ నటన నాకు నచ్చింది. అది ప్రత్యేకంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. నేను పూర్తిగా '#క్రష్​మికా' క్లబ్​లో జాయిన్ అవుతున్నాను' అని ఇన్​స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఆలియా పోస్ట్​పై రష్మిక స్పందించారు. 'బిగ్​ బిగ్ హగ్స్​ యా.. లవ్​ యూ' అని ఆలియా స్క్రీన్​షాట్​ను తన స్టోరీలో షేర్ చేశారు.

Alia Bhatt About Rashmika Mandanna
ఆలియా భట్ ఇన్​స్టా స్టోరీ

Animal Movie Cast : అయితే తెలుగుతో సహా పలు భాషల్లో నటించిన రష్మిక 'నేషనల్​ క్రష్'​గా గుర్తింపు పొందారు. రష్మికతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, నటులు బాబీ దెఓల్, అనిల్ కపూర్​, తృప్తి డిమ్రీ, శక్తి కపూర్ ఇతర తారాగణం టాలెంట్​, అంకితభావాన్ని కొనియాడారు ఆలియా భట్. అద్భుతంగా నటించారని ప్రశంసించారు.

ఇక 'యానిమల్​' సినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల సెంటిమెంట్​తో రూపొందిన ఈ చిత్రంలో రణ్​బీర్ కపూర్​, రష్మిక మందన్నతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ నటించారు.​ నాన్న పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్​ కనిపించగా.. విలన్​ రోల్​లో బాబీ దేఓల్​ నటించారు. ఈ చిత్రంలోని పాటలు, బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ ప్రేక్షకులను​ తెగ ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా రణ్​బీర్​ డిఫరెంట్ షేడ్స్​ కూడా ప్రేక్షకుల్లో సినిమాపై ఇంట్రెస్ట్ పెంచాయి. ఈ మూవీని భద్రకాలీ పిక్చర్స్​, టీసిరీస్​ సంయుక్తంగా నిర్మించాయి.

'ఇప్పటి వరకు 20 సార్లు పెళ్లి చేసుకున్నాను - ఆ విషయంలో నాకు చాలా ఎక్స్​పీరియెన్స్ ఉంది!'

పాన్ఇండియా రేంజ్​లో 'సిల్క్ స్మిత' బయోపిక్ - హీరోయిన్ ఎవరో తెలుసా?

Last Updated : Dec 2, 2023, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.