Akshaykumar Panmasala add: సినీహీరోలు సినిమాలతో పాటు ప్రకటనల ద్వారా కూడా అభిమానులను అలరిస్తూ ఉంటారు. అలానే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఇప్పటికే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ ప్రొడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు.
గత కొంతకాలంగా అక్షయ్ కుమార్.. విమల్ పాన్ మసాలాకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే అక్షయ్ టొబాకో ప్రోడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం ఆయన అభిమానులకు నచ్చలేదు. దీంతో ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అభిమానుల నుంచి అనేక ప్రతిపాదనలు రావడం వల్ల.. టొబాకో బ్రాండ్‌కు ఇకపై అంబాసిడర్‌గా కొనసాగనని అక్షయ్ తాజాగా ప్రకటించారు. బుధవారం అర్ధరాత్రి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
"నేను.. నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా మీ నుంచి వస్తున్న స్పందన నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. నేను పొగాకును ఆమోదించలేదు.. ఆమోదించను కూడా. ఇక పై ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పుకుంటున్నా. అయితే ఆ సంస్థతో ప్రస్తుతం ఉన్న ఒప్పంద గడువు వరకు ప్రకటనలు మాత్రం వస్తుంటాయి. ఈ యాడ్ ద్వారా నాకు వచ్చిన ఆదాయాన్ని మంచి పనులకు వినియోగిస్తాను. భవిష్యత్‌లో చట్టపరమైన ప్రకటనలకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాను." అని అక్షయ్ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: రష్మికకు సూపర్ ఆఫర్.. ఆలియా స్థానంలో!