ETV Bharat / entertainment

టాలీవుడ్​ హీరోస్​కు తమిళ డైరెక్టర్స్​ షాకులు - టాలీవుడ్ హీరోలకు తమిళ డైరెక్టర్స్​ షాక్​

నాగచైతన్య-వెంకట్​ ప్రభు కలిసి చేసిన 'కస్టడీ' సినిమా రిలీజై మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తమిళ దర్శకులు-తెలుగు హీరోల కాంబోలో విడుదలై బోల్తా కొట్టిన సినిమాలేంటో చూద్దాం..

Tamil Directors gave disasters to Telugu heroes
టాలీవుడ్​ హీరోస్​కు తమిళ డైరెక్టర్స్​ షాకులు
author img

By

Published : May 13, 2023, 1:10 PM IST

ఎప్పుడు ఏ కాంబినేషన్​లో సినిమా కుదరుతుందో ఊహించలేం. ఒకప్పుడైతే ఓ భాషలోని టాప్‌ హీరోలు, అక్కడి స్టార్​ డైరెక్టర్స్​తో కలిసి ఎక్కువగా సినిమాలు చేసేవాళ్లు. కొంతమంది మాత్రమే కొత్తవారితో లేదా పక్క ఇండస్ట్రీ దర్శకుడితో కలిసి ఎక్స్​పెరిమెంట్లు చేసేవారు. అయితే ఇప్పుడు పాన్‌ ఇండియా ట్రెండ్‌ పుణ్యమా అని భిన్నమైన కలయికల్లో సినిమాలు సెట్ అవుతున్నాయి. మన డైరెక్టర్స్​ పొరుగు భాషల్లోని హీరోలతో, అక్కడి డైరెక్టర్స్​ మన కథనాయకులతో జట్టు కడుతున్నారు. అలా వాళ్లతో వీళ్లు... వీళ్లతో వాళ్లు కలుస్తూ సరికొత్త కలయికలకు తెర తీస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఎక్కువగా తమిళ దర్శకులు -మన హీరోలతో కలిసి పని చేస్తున్నారు. కానీ ఎన్నో అంచనాలతో తెరకెక్కి విడుదలైన ఆ కాంబోలు బోల్తా కొడుతున్నాయి. అక్కడ డైరెక్టర్లకు మన తెలుగు స్టార్లకు వరుస షాకులు ఇస్తున్నారు. ఎక్కువగా డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. కలెక్షన్లను వసూళ్లు చేయలేక చతికిలపడుతున్నాయి.

తాజాగా అక్కినేని నాగచైతన్య.. కోలీవుడ్ డైరెక్టర్​ వెంకట్​ ప్రభుతో కలిసి చేసిన కస్టడీ మంచి అంచనాలతో మే 12న థియేర్లలో రిలీజైంది. ఈ చిత్రం మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుంది. బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది. ఫస్ట్ డే కేవలం నాలుగు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అసలే అక్కినేని ఫ్యామిలీ వరుస ఫ్లాప్​లతో ఇబ్బంది పడుతున్న సమయంలో.. కనీసం కస్టడీ అయినా గట్టెక్కిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆశలు ఆవిరయ్యాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అక్కడి దర్శకులతో మన హీరోలు చేసిన సినిమాలు ఏవి బోల్తా కొట్టాయో చూద్దాం..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • గతేడాది యంగ్ హీరో రామ్ పోతినేని.. తమిళ సీనియర్ దర్శకుడు లింగుస్వామితో 'ది వారియర్' చేశాడు. ఇది భారీ డిజాస్టర్​గా నిలిచింది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్​.
  • హీరో సందీప్ కిషన్​.. కోలీవుడ్ డైరెక్టర్​ రంజిత్​ కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్​ 'మైఖేల్'​ కూడా అంతే. గౌతమ్​ మేనన్​, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్​కుమార్ వంటి స్టార్లు నటించినా సినిమాకు ఫలితం లేకపోయింది. కథ ఆకట్టుకోలేకపోయింది.
  • హీరో శర్వాంద్​- శ్రీ కార్తిక్​ కలిసి చేసిన ఒకే ఒక జీవితం మూవీ కూడా యావరేజ్ టాక్​ను దక్కించుకుంది. ఆడియెన్స్​ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. టైమ్​ ట్రావెల్​ నేపథ్యంలో వచ్చిందీ సినిమా.
  • ఇక గతంలో కొన్నేళ్ల కిందట సూపర్ స్టార్ మహేశ్​ బాబు.. తమిళ టాప్​ డైరెక్టర్​ మురుగదాస్‌ దర్శకత్వంలో'స్పైడర్' చేశారు. అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్​గా నిలిచింది. ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేదు. మహేశ్​ కెరీర్​లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్​గా నిలిచింది.
  • అర్జున్ రెడ్డి మూవీతో సెన్సేషన్ స్టార్​గా మారిపోయిన విజయ్​ దేవరకొండ తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్‌తో 'నోటా' చేయగా అది కూడా అతి పెద్ద ఫ్లాప్​గా నిలిచింది. గతంలో ఇంకా పలు చిత్రాలు ఫ్లాప్​ అయ్యాయి. వెంకటేశ్ నాగవల్లి, పవన్ కల్యాణ్​ పంజా, కొమరం పులి, బంగారం, రామ్ పోతినేని గణేశ్, ప్రభాస్ రెబల్​ ఎన్నో చిత్రాలు ఆడలేదు.
  • ఇకపోతే త్వరలోనే మరిన్ని సినిమాలు తమిళ దర్శకుడు-తెలుగు హీరో కాంబోలో రానున్నాయి. వాటిలో దిగ్గజ దర్శకుడు శంకర్​-రామ్​చరణ్​ ఆర్​సీ 15 ఉంది. సముద్రఖని-పవన్ కల్యాణ్​​ కలయికలో వినోదయం సీతం తెలుగు రీమేక్ రూపొందుతోంది. ​ మరి ఈ రెండు చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో. ఇకపోతే హీరో గోపిచంద్​ కూడా కోలీవుడ్ సింగం సిరీస్​ ఫేమ్​ డైరెక్టర్​ హరితో ఓ సినిమా చేసే చర్చల్లో ఉన్నట్లు ఇటీవలే ప్రచారం సాగింది.

ఇదీ చూడండి: టాలీవుడ్​లో ఇప్పుడంతా వారి 'మ్యూజిక్కే' ట్రెండ్.. అంతా అక్కడోళ్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.