ETV Bharat / entertainment

'ఆదిపురుష్'​ ట్రైలర్​ ఈవెంట్​.. 70 దేశాల్లో గ్రాండ్​ రిలీజ్​ - 70 దేశాల్లో ఆదిపురుష్​ మూవీ ట్రైలర్​

Adipurush Trailer Launch : పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న మైథాలజికల్​ మూవీ 'ఆదిపురుష్​'. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్​ ఇచ్చింది మూవీ టీమ్​. ఈ క్రమంలో ట్రైలర్​ లాంచ్​ అఫీషియల్​ డేట్​ను రివీల్​ చేసింది.

adipurush trailer launch
adipurush trailer launch
author img

By

Published : May 6, 2023, 5:22 PM IST

Adipurush Trailer Launch : పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​ లీడ్​ రోల్​లో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'. గత కొంత కాలంగా మోషన్​ పోస్టర్లతో ఫస్ట్​ సింగిల్స్​తో అభిమానుల్లో ఆసక్తి రేపింది. ఇక ఈ సినిమా గురించి ఇటీవలే మేకర్స్​ ఓ తాజా అప్డేట్​ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఆదిపురుష్​ ట్రైలర్‌ను భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్​ ప్లాన్ చేస్తున్నారు. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని 70 దేశాల్లో ఈ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్​ గ్లోబల్ లెవెల్​లో పాపులర్​ కానుంది. ట్రైలర్ తేదీని ప్రకటిస్తూనే ప్రభాస్​కు సంబంధించిన ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. ఇందులో ఆకాశం వైపుకు విల్లును ఎక్కుపెట్టిన రాఘవుడిగా ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉంది. ఈ ట్రైలర్​ 2డీతో పాటు త్రీడీలోనూ థియేట్రికల్ రిలీజ్​ చేసేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయని సమాచారం.

మరోవైపు 'ఆదిపురుష్​' సినిమా రిలీజ్ అయ్యేందుకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ.. మేకర్స్ ఇంకా విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో వర్క్ చేస్తూనే ఉన్నారట. ఫైనల్ అవుట్ పుట్ ఇంకాస్త మెరుగ్గా రావాలని భావిస్తున్నారట. మేకర్స్ ఇంకా ఈ పనిలోనే ఉన్నారని.. ఫైనల్ అవుట్​పుట్​ ఇంకా రాలేదన్న రూమర్స్​తో.. ఈ సినిమా వాయిదా పడుతుందని నెట్టింట్లో చర్చ మొదలైంది. అయితే, ఈ సినిమా రిలీజ్ సమయానికి ఫైనల్ వెర్షన్ రెడీగా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు​.

Adipurush trailer : అప్పట్లో రిలీజైన టీజర్​పై అభిమానులు పలురకాలుగా రియాక్టయ్యారు. వీడియో మొత్తం కార్టూన్ యానిమేషన్‌లా ఉందంటూ నెటిజన్లు విమర్శించారు. వీఎఫ్ఎక్స్ అస్సలు బాగాలేవని కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పాత్రల చిత్రీకరణ కూడా వివాదాస్పదమైంది. ఆంజనేయుడు, లంకేశ్వరుడు పాత్రలను రామాయణంలో వర్ణించినట్టుగా కాకుండా అందుకు విరుద్ధంగా ఉన్నాయంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు.. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ పలువురు డిమాండ్​ చేశారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న మేకర్స్​.. సినిమాకు మరిన్ని మెరుగులు దిద్దాలని డిసైడ్​ అయ్యారు. ఈ క్రమంలో వీఎఫ్ఎక్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలని భావించి.. విడుదలను వాయిదా వేశారు. అలా జూన్ 16న విడుదల తేదీనీ ఖరారు చేశారు.

Adipurush prabhas :ఇక సినిమా విషయానికి వస్తే.. తాన్హాజీ లాంటి సూపర్​ హిట్ సినిమాలను తెరకెక్కించిన బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్​ రూపొందిస్తున్న ఆదిపురుష్​.. పాన్ ఇండియా లెవెల్​లో విడుదల కానుంది. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతాదేవిగా కృతిసనన్ కనిపించనున్నారు. లంకేశుని పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. టీ-సిరీస్, రెట్రోఫైల్స్‌తో పాటు యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.