ETV Bharat / entertainment

Adipurush OTT : 'ఆదిపురుష్' మూవీ వచ్చేది ఆ ఓటీటీలోకే! - ఆదిపురుష్​ అమెజాన్​ ప్రైమ్​

Adipurush OTT : బాలీవుడ్​ డైరెక్టర్​ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్ ఓటీటీ రైట్స్​పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందట.

Adipurush OTT
Adipurush OTT
author img

By

Published : Jun 16, 2023, 3:02 PM IST

Adipurush OTT : ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా, ఆత్రుతగా ఎదురుచూసిన పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. పాన్ ఇండియా రేంజ్ వివిధ భాషల్లో రిలీజైన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత పాత్రలో నటించారు. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులపై అప్పుడే వార్తలు మొదలయ్యాయి.

Adipurush Amazon Prime : 'ఆదిపురుష్' మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ ధృవీకరించిందట. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 2023 వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండదని పలువురు అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ తో పాటు దేవదత్తా నాగే, సోనాల్ చౌహాన్, సన్నీ సింగ్, ఇతరులు నటించారు.

ప్రభాస్​కు అత్యంత ముఖ్యం..
Adipurush Prabhas : 'ఆదిపురుష్'కు ముందు ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్', 'సాహో' బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశాయి. భారీ బడ్జెట్​తో ఈ సినిమాలను దర్శకనిర్మాతలు తెరకెక్కించినప్పటికీ.. ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ముందు నుంచే ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నా.. చివరికి మాత్రం మేకర్స్​ను తీవ్ర నిరాశలోకి నెట్టాయి. 'బాహుబలి' సిరీస్ తర్వాత ప్రభాస్​కు మళ్లీ ఆ రేంజ్​లో పడలేదన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రభాస్ 'ఆదిపురుష్' పైనే భారీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ కల నెరవేరుతుందా.. అనేది వేచి చూడాల్సి ఉంది.

ఎంతో కష్టపడ్డ కృతి!
Adipurush Kriti Sanon : ఇక ఈ సినిమా కోసం కృతిసనన్ కూడా ఎంతో కష్టపడ్డారని సమాచారం. ఈ సినిమాతో రాబోయే రోజుల్లో కృతిసనన్ కు వరుస విజయాలు ఖాయం అని ఆమె ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం ఈ సినిమా సక్సెస్ కీలకంగా తోస్తోంది.

మొదటి నుంచి వార్తల్లోనే..
భారీ మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'.. మొదట్నుంచి ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రారంభంలో కొన్ని వివాదాలు ఎదుర్కున్న ఈ మూవీ... అనంతరం గ్రాఫిక్స్​లో చేసిన పలు మార్పులు ప్రేక్షకులకు మళ్లీ బూస్టప్​ను తీసుకొచ్చాయి. దీంతో ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా.. జూన్ వరకు ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 16న థియేటర్లలో రిలీజైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.