ETV Bharat / entertainment

Adipurush box office day 4 : హిందీ కలెక్షన్స్ డౌన్​.. సినిమా ఆపాలంటూ మోదీకి ఫిర్యాదు​! - ఆదిపురుష్​ సినిమా

Adipurush Day 4 Collections : వరుస వివాదాలతో థియేటర్లలో ప్రదర్శితమవుతున్న 'ఆదిపురుష్'​ హిందీ బాక్సాఫీస్​ కలెక్షన్స్​ జోరు తగ్గిందని తెలిసింది. ఆ వివరాలు..

Adipurush box office day 4
Adipurush box office day 4
author img

By

Published : Jun 20, 2023, 2:49 PM IST

Updated : Jun 20, 2023, 3:06 PM IST

Adipurush Day 4 Collections : పాన్ ఇండియా స్టార్​ హీరో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్​' ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఫస్ట్​ నెగిటివ్​ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్లగా.. ఇప్పుడు నాలుగో రోజు జోరు తగ్గినట్టు అనిపిస్తోంది. నెగటివ్​ టాక్​ వల్ల సోమవారం హిందీ వెర్షన్​ కలెక్షన్స్​ పడిపోయాని సినిమా క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అన్నారు. బలమైన ఓపెనింగ్స్​తో వారాంతాన్ని దాటిన ఈ మూవీ సోమవారం బాక్సాఫీస్​ ముందు కుప్పకూలిందని పేర్కొన్నారు. ఈ చిత్రం విడుదల రోజున రూ.86.75 కోట్లు మేర వసూళ్లు చేయగా శనివారం రూ.65.25 కోట్లు, ఆదివారం రూ.69.10 కోట్ల కలెక్షన్స్​ను అందుకుందట. అయితే సోమవారం మాత్రం దాదాపు రూ. 20 కోట్లు మాత్రమే అందుకుందని సమాచారం అందింది.

Adipurush complaint : సోషల్​మీడియాలో భారీగా ట్రెండ్​ అవుతున్న నెగిటివ్​ టాక్​.. ఈ సినిమాపై భారీ ప్రభావం చూపుతోంది. దీంతో చాలా మంది ముందుగానే బుక్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేసుకున్నారంటూ నెట్టింట్లో పలువురు ఫ్యాన్స్​ దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తున్నారు. అలాగే మరోవైపు 'ఆదిపురుష్​' స్క్రీనింగ్​ను నిలిపివేయాలంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. భవిష్యత్తులో థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా 'ఆదిపురుష్' ప్రదర్శనను వెంటనే నిషేధించాలంటూ వినతి పత్రంలో అభ్యర్థించారు. డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ మంటషీర్ శుక్లాతో పాటు చిత్ర నిర్మాతలపైన ఫిర్యాదు దాఖలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

"ఆదిపురుష్‌ హిందువుల మనోభావాలను, సనాతన ధర్మాన్నీ దెబ్బతీసేలా ఉంది. శ్రీరాముడు దేవుడు. ఈ చిత్రంలోని సంభాషణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని ఎంతో బాధ పెట్టేలా ఉన్నాయి. వీడియో గేమ్‌లలో పాత్రల్లాగా దేవుళ్లను చూపించారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతటి అవమానకరమైన చిత్రం అస్సలు భాగం అవ్వకూడదు. రామాయణంపై, శ్రీరాముడిపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ సినిమా పూర్తిగా పాడు చేసింది. దీనిని వెంటనే ఆపేయండి. భవిష్యత్తులో ఓటీటీలో కూడా దీనిని రిలీజ్​ చేయొద్దు. మీరు సినిమా నిలిపివేసేలా ఆదేశించాలని అభ్యర్థిస్తున్నాం" అని లేఖలో సినీ వర్కర్స్​ అసోసియేషన్​ పేర్కొంది.

Adipurush ban news : ఇకపోతే ఇప్పటికే నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో 'ఆదిపురుష్‌' సినిమాను బ్యాన్ చేశారు. 'సీతా దేవీ నేపాల్‌లో జన్మించింది. కానీ ఆమె భారత్‌లో జన్మించినట్లు చిత్రంలో సంభాషణ ఉంది. దానిని వెంటనే మార్చాలి' అని డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు తమ వద్ద బాలీవుడ్ మూవీస్​ను ప్రదర్శించేది లేదంటూ కాఠ్‌మండూ, ఫొఖారాలో సినిమాపై నిషేధం విధించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదిపురుష్ మూవీటీమ్​ ఖాట్మాండు మేయర్‌కు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ కూడా రాసింది.

Adipurush Cast : ఇకపోతే రామాయణం ఆధారంగా వీఎఫ్​ఎక్స్​ను ఉపయోగించి దర్శకుడు ఓంరౌత్‌ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటించారు. సీతగా హీరోయిన్‌ కృతిసనన్‌ నటించింది. జూన్‌ 16న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటి వరకు రూ.375 కోట్ల వసూళ్లు చేసింది.

Last Updated : Jun 20, 2023, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.