ETV Bharat / entertainment

'ఆదిపురుష్‌'పై ట్రోలింగ్​కు బ్రేక్​ వేసేలా మూవీ టీమ్ స్పెషల్​ ఆపరేషన్! - ఆదిపురుష్ ట్రోల్స్​ రియాక్షన్​

భారీ బడ్జెట్​తో రూపొందుతున్న మైథలాజికల్​ మూవీ 'ఆదిపురుష్ట​. ఈ సినిమా టీజర్​ విడుదలైనప్పటి నుంచి నెట్టింట్లో ట్రోలింగ్​ ఆగట్లేదు. ఆ విమర్శలకు క్లారిటీ ఇస్తూ చిత్ర యూనిట్​ ఓ ప్రకటన చేసింది.

adipursh-team-in-damage-control-mode
adipurush
author img

By

Published : Oct 6, 2022, 7:01 AM IST

Adi Purush teaser trolls : ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్‌ మూవీ 'ఆదిపురుష్'. తాజాగా విడుదలైన టీజర్‌పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు సైతం ఆదిపురుష్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రామాయణంలోని పాత్రలను అపహాస్యం చేస్తూ విజువల్ ఎఫెక్ట్స్ జోడించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం 'ఆదిపురుష్' టీజర్‌ను హైదరాబాద్ వేదికగా 3డీలోనూ విడుదల చేయబోతోంది. అంతేకాకుండా ఆదిపురుష్ చిత్రంపై వస్తున్న విమర్శలకు ముగింపు పలకాలని భావిస్తోంది.

'ఆదిపురుష్' టీజర్‌పై సినీ విమర్శలు, హిందూత్వ వాదులు, రాజకీయ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ.... అందులోని పాత్రల ఆహార్యంపై చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా 'ఆదిపురుష్' టీజర్‌ను 3డీలో విడుదల చేయబోతున్నారు. ఈ వేడుకకు దర్శకుడు ఓం రౌత్, కథానాయకుడు ప్రభాస్ హాజరుకానున్నారు. ఈ వేడుకలో ఆదిపురుష్ చిత్రంపై వస్తున్న విమర్శలకు పూర్తి వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

టీజర్‌పై 'శక్తిమాన్‌' ముఖేష్‌ఖన్నా స్పందన..
ఇతిహాసగాథ రామాయణాన్ని ఇలా తీస్తే మాత్రం కుదరదని 'శక్తిమాన్' పాత్రధారి ముఖేష్‌ ఖన్నా అభిప్రాయపడ్డారు. ప్రభాస్‌ రాముడిగా ఓంరౌత్‌ రూపొందిస్తున్న మైథలాజికల్‌ మూవీ 'ఆది పురుష్‌'. సీతగా కృతి సనన్‌, లంకేష్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. దసరా కానుకగా విడుదలైన టీజర్‌పై సోషల్‌మీడియాలో ట్రోలింగ్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు, పలువురు రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు.

తాజాగా 'ఆది పురుష్‌' టీజర్‌ను చూసిన 'శక్తిమాన్‌' పాత్రధారి ముఖేష్‌ఖన్నా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు."ఇటు రాముడు.. రాముడిగానూ, అటు హనుమాన్‌.. హనుమంతుడిగానూ కనిపించడం లేదు. దేవుళ్లు ఎవరూ ఆర్నాల్డ్‌ ష్వాజ్‌నెగ్గర్‌లా ఉండరు. రాముడు, కృష్ణుడిని చూడండి. వాళ్లేమీ బాడీ బిల్డర్స్‌ కాదు. వాళ్ల ముఖాలు సున్నితంగా, విధేయతతో ఉంటాయి. కోమలమైన సౌందర్యం కలిగి ఉంటారు తప్ప గడ్డాలు, మీసాలు కలిగి ఉండరు" అని కాస్త ఘాటూగానే స్పందించారు.

"సినిమాకు 'ఆది పురుష్‌' అని పెట్టారు. బాగానే ఉంది. ఆ పేరు పెట్టుకున్నప్పుడు రాతియుగపు మనిషి స్టోరీ చెప్పి ఉంటే బాగుండేది. కానీ, రామాయణాన్ని ఎంచుకుని, సినిమా చేయాలనుకుంటే పాత్రలు, వాటి ఆహార్యం మార్చాల్సింది. ప్రేక్షకుల విశ్వాసంతో మీరు ఆటలాడుతున్నారు. రూ.100 నుంచి రూ.1000కోట్లు పెట్టి, వీఎఫ్‌ఎక్స్‌తో చిత్రాన్ని తీస్తానంటే అది రామాయణం అయిపోదు. అది విలువలు, ప్రతిభలపై ఉంటుంది. 'అవతార్‌'ను స్ఫూర్తిగా తీసుకుని, పాత్రలను తీర్చిదిద్దటం సరైంది కాదు. ఈ విధంగా రామాయణ పాత్రలతో మీరు వినోదాన్ని పంచాలనుకుంటే, ప్రజలు మిమ్మల్నే చూసి నవ్వటమే కాదు, వారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.

ఇదొక ఫిక్షనల్‌ స్టోరీ అంటూ మీరు చెప్పుకోవచ్చు. కానీ, దయచేసి రామాయణం అని మాత్రం చెప్పకండి. సంప్రదాయాలు, మత విశ్వాసాలు, ఇతిహాసాలను మార్చడానికి డబ్బులు వృథా చేయకండి. ఇతర మతాలతో ఇలాగే చేయగలరా" అని అంటూ ముఖేష్‌ఖన్నా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'ఆది పురుష్‌' సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న వివిధ భాషల్లో విడుదల కానుంది.

ఇదీ చదవండి: దీపావళికి ఓటీటీలో 'బింబిసార'.. ఒకేచోట 25 జేమ్స్​బాండ్ చిత్రాలు

పుష్ప-2లో సుకుమార్​కు నో రెమ్యునరేషన్!.. బన్నీకి రూ.125 కోట్లు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.