ETV Bharat / entertainment

ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. స్టార్​ హీరోయిన్! ఎవరో గుర్తుపట్టగలరా? - నటి స్నేహ చిన్నప్పటి ఫొటో

పైన ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఓ స్టార్​ హీరోయిన్​. సెకండ్​ ఇన్నింగ్స్​లో రామ్​చరణ్​, అల్లుఅర్జున్​ వంటి స్టార్​ హీరోల సినిమాల్లో నటించారు. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఈమెని మీరు గుర్తుపట్టగలరా?

sneha child hood pic
స్నేహ చిన్నప్పటి ఫొటో
author img

By

Published : Sep 12, 2022, 8:34 PM IST

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి అసలు పేరు రాజారాం నాయుడు. 1981 అక్టోబర్ 12న ముంబయిలో నివాసముంటున్న ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. 'ఇంగానే ఒరు నిలపక్షి' అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్​గా అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత తమిళంలో ఎన్నవలే సినిమాతో కోలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్ నటించిన 'ప్రియమైన నీకు' సినిమాతో టాలీవుడ్​లో అడుగుపెట్టి హీరోయిన్​గా ఎదిగారు. ఇంతకీ ఈమె మరోవరో కాదు సీనియర్​ నటి స్నేహ.

ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్​లో అడుగుపెట్టిన స్నేహ.. తన అందం, అభినయంతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. తొలివలపు సినిమాలో అమాయకమైన యువతిగా కనిపించిన ఆమె.. హనుమాన్ జంక్షన్, వెంకీ, శ్రీరామదాసు వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించారు. 2011లో వచ్చిన రాజన్న సినిమాలో నటించిన స్నేహ.. ఆ తర్వాత టాలీవుడ్​కు దూరమయ్యారు. 2012లో చెన్నైలో ప్రసన్న వెంకటేశన్ అనే తమిళ హీరోను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

Actress sneha childhood pic
స్నేహ

2014లో తెలుగులో ఉలవచారు బిర్యానీతో సెకండ్ ఇన్నింగ్స్​ను ప్రారంభించిన స్నేహ.. సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ వంటి సినిమాల్లో నటించారు. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షోస్ లోనూ హోస్ట్​గా, జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సోషల్​మీడియాలోనూ చుర్గుగా ఉంటూ అభిమానులను పలకరిస్తున్నారు.

Actress sneha childhood pic
స్నేహ

ఇదీ చూడండి: విజయ్‌ కొత్త సినిమా అప్డేట్​.. ప్రముఖ నిర్మాణ సంస్థ 100వ ప్రాజెక్టుగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.