ETV Bharat / entertainment

వెనక్కి తగ్గా.. ఓడిపోలేదు: సమంత షాకింగ్​ కామెంట్స్​ - సమంత లేటెస్ట్ అప్డెట్స్​

హీరోయిన్ సమంత చేసిన తాజా పోస్ట్​ చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

samantha
సమంత
author img

By

Published : Oct 8, 2022, 4:58 PM IST

స్టార్​ హీరోయిన్​ సమంత మళ్లీ ఇప్పుడు హాట్​టాపిక్​గా మారింది. ఆమె ఇన్​స్టాలో పెట్టిన ఓ పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. తన పెంపుడు శునకం ఫొటోను శుక్రవారం రాత్రి షేర్‌ చేసిన సామ్‌.. ఆ పోస్ట్‌కు "వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు" అని వ్యాఖ్య రాసుకొచ్చింది. దీనిపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. "మోర్‌ పవర్‌ టు యూ, బీ స్ట్రాంగ్‌" అనే అర్థం వచ్చేలా ఎమోజీలతో కామెంట్స్‌ పెట్టారు. దీంతో ఈ పోస్ట్‌ కాస్త వైరల్‌ అయ్యింది. సమంత తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించే ఈ పోస్ట్‌ పెట్టారని అభిమానులు అంటున్నారు. 'ఏమైంది మేడమ్‌... ధైర్యంగా ఉండండి' అంటూ సమంతకు ధైర్యం చెబుతున్నారు.

జూన్‌ 16 తర్వాత... సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో అంతగా కనిపించడం లేదు. తరచూ పర్సనల్‌ అప్‌డేట్స్‌ ఇచ్చే సామ్‌.. జూన్‌ 16 తర్వాత ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదు. కేవలం సినిమాల అప్‌డేట్స్‌, ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న వాణిజ్య ప్రకటనలను మాత్రమే షేర్‌ చేస్తున్నారు. దీంతో సామ్‌ కెరీర్‌పై నెటిజన్లు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. విడాకుల తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయంటూ మాట్లాడుకున్నారు.

ఈ క్రమంలో సామ్‌ పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక, సమంత నటించిన 'యశోద', 'శాకుంతలం' నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నాయి. త్వరలో ఈ సినిమాలు విడుదల కానున్నాయి. మరోవైపు ఆమె వరుణ్‌ ధావన్‌తో కలసి చేయనున్న 'సిటాడెల్‌ ఇండియా' వెబ్‌సిరీస్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధం కానున్న ఈ సిరీస్‌ కోసం ఆమె కసరత్తులు చేస్తున్నారు.

ఇదీ చూడండి: అఖండ To ఆచార్య.. కోట్లు కుమ్మరిస్తున్న బాలీవుడ్..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.