ETV Bharat / entertainment

జబర్దస్త్​కు కమ్​బ్యాక్​ ఇచ్చిన రోజా.. స్పెషల్​ ఏంటంటే..?? - రోజా లేటెస్ట్ అప్డేట్స్

పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీగా ఉన్న నటి రోజా మళ్లీ జబర్దస్త్​కు రీఎంట్రీ ఇచ్చారు. లేటెస్ట్​గా వచ్చిన ప్రోమోలో కనిపించి సందడి చేశారు. మిగతా జడ్జీలతో కలిసి షోలో సందడి చేసిన రోజా ఎప్పటిలాగే ఆర్టిస్టులపై తన మార్క్ పంచెస్​ వేసి నవ్వించారు. ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

actress roja re entry in jabardast 500 episode
actress roja
author img

By

Published : Dec 30, 2022, 1:52 PM IST

jabardast 500 episode : 'నాతో పాటు వచ్చిన హీరోయిన్స్ చాలామందిని ప్రేక్షకులు మరిచిపోయారు. నేను ఇప్పటి జనరేషన్​కు ఇంకా గుర్తున్నాను అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ జబర్దస్త్' అని సినీ నటి రోజా అన్నారు. కొంత కాలంగా సినిమాలకు, షోలకు దూరంగా ఉన్న ఈ తార మరోసారి బుల్లితెరపై సందడి చేశారు.

ఈటీవీ షో జబర్దస్త్​.. కామెడీకి బ్రాండ్​గా నిలిచిన షో. 2013 నుంచి నిర్విరామంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో దీనికి సాటి మరే షో రానంతగా అందరిని ఆకట్టుకుంది. గురువారం, శుక్రవారం అయితే చాలు అందరూ ఈ షో కోసం ఎంతో వెయిట్​ చేస్తుంటారు. ఇక ఆర్టిస్టులతో పాటు జడ్జీలు వేసే పంచులు మామూలుగా ఉండవు. ఒక్కోసారి ఆ మాటలు కాంట్రవర్సీలకు దారీ తీసినప్పటికీ ఆ షోకు ఉన్న విశేష ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. జడ్జీలుగా నాగబాబు రోజా కాంబో అదుర్స్​ అని అప్పట్లో అందరూ అంటుండేవారు. అయితే పూర్తి స్థాయిలో రాజకీయాలకు అంకితమవ్వాలనుకున్న రోజా కొంత కాలం క్రితం జబర్దస్త్​కు గుడ్​ బై చెప్పారు.

అయితే తాజాగా జబర్దస్త్​ తన 500వ ఏపిసోడ్​ కంప్లీట్​ చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ ప్రోమో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. అలా ఈ షోకు సర్​ప్రైజ్​ గెస్ట్​గా మునుపటి జడ్జీ రోజా వచ్చి మళ్లీ షోలో సందడి చేశారు. ఇక షోలో మళ్లీ రోజా కనిపించడంతో ఫ్యాన్స్ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. మిగతా జడ్జీలతో కలిసి షోలో సందడి చేసిన రోజా ఎప్పటిలాగే ఆర్టిస్టులపై తన మార్క్ పంచెస్​ వేసి నవ్వించారు.​ షో లాస్ట్​లో రోజాకు జబర్దస్త్​ టీమ్​ సన్మానం చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.