ETV Bharat / entertainment

రేణూ దేశాయ్​కు​ గుండె జబ్బు​.. ఆందోళనలో ఫ్యాన్స్! - నటి రేణు దేశాయ్ తాజా ఇన్​స్టా పోస్ట్​

ఈమధ్య కాలంలో పలువురు సినీ నటులు​ అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవలె సమంత మయోసైటిస్‌ బారిన పడగా, మమతామోహన్ దాస్​ కూడా తన ఆరోగ్య సమస్యల తెలిపారు. ఈ క్రమంలో నటి రేణూ దేశాయ్‌ పెట్టిన ఓ ఇన్​స్టా పోస్ట్​ అభిమానులను ఆందోళన చెందుతున్నారు.

actress renu desai
actress renu desai
author img

By

Published : Feb 14, 2023, 6:56 PM IST

సినిమా పరిశ్రమలోని పలువురు స్టార్స్ తమకొచ్చిన అరుదైన వ్యాధుల గురించి తెలియజేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ తమ అభిమాన తారలకు ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. గతేడాది సమంత వయోసైటిస్​ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత కల్పికా గణేష్, మమతా మోహన్‌దాస్‌ కూడా తమకున్న అనారోగ్య సమస్యల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ నటి​ రేణూ దేశాయ్‌ కూడా తన ఆరోగ్య సమస్యల గురించి అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియో పోస్ట్​ చేశారు. ఆ వీడియోలో 'లిటిల్​ ఐరన్​ మ్యాన్​ మూమెంట్.. బికాజ్​ ఆఫ్​ ది హోల్టర్​ మెషీన్​'(హోల్టర్​ మెషీన్-గుండె రిథమ్​ను కొలిచే పరికరం)​ అని రాసుకొచ్చారు.

renu desai
రేణూ దేశాయ్​

"నా శ్రేయోభిలాషులందరికీ ఓ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. నేను కొన్నేళ్లుగా గుండే సమస్యలు, తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు శక్తిని కూడబెట్టడం చాలా కష్టం. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పేందుకు ఓ కారణం ఉంది. నాలా.. ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే.. వారిలో ధైర్యాన్ని నింపేందుకు, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసేందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ధైర్యాన్ని కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఒక రోజు మనకు ఫలితం వస్తుంది. ఎప్పటికీ ఆశను కోల్పోవద్దు. నిరుత్సాహపడొద్దు. జీవితం మీద, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్​ప్రైజ్‌లను ప్లాన్ చేసి ఉంచింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నవ్వుతూ వాటిని ఎదుర్కోండి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది.. మందులు వేసుకుంటున్నాను.. యోగా చేస్తున్నాను. పోషకాహారాన్ని తీసుకుంటున్నాను.. త్వరలోనే మళ్లీ మామూలు మనిషిలా తిరిగి వస్తాను. షూటింగ్‌ల్లో పాల్గొంటాను"

--రేణూ దేశాయ్​, నటి

కానీ ఇంతకి తనకు వచ్చిన వ్యాధి ఏంటనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. కాగా 'బద్రి' సినిమాతో టాలీవుడ్​ తెరంగేట్రం చేసిన ఈ తార.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. నటిగానే కాకుండా దర్శకురాలు, నిర్మాత, రచయిత, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పలు విభాగాల్లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న రేణూ.. మాస్ మహారాజ రవితేజ పాన్‌ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'తో టాలీవుడ్​లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.