ETV Bharat / entertainment

సినీ నటి పల్లవి జోషికి తీవ్రగాయాలు.. హైదరాబాద్​లో షూటింగ్​ జరుగుతుండగా.. - undefined

ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి సతీమణి, నటి పల్లవి జోషి తీవ్రంగా గాయపడ్డారు. 'ది వ్యాక్సిన్‌వార్‌' మూవీ చిత్రీకరణలో ఈ ప్రమాదం జరిగింది.

actress pallavi joshi injured in movie shooting

author img

By

Published : Jan 16, 2023, 8:02 PM IST

ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి సతీమణి, నటి పల్లవి జోషి తీవ్రంగా గాయపడ్డారు. 'ది వ్యాక్సిన్‌వార్‌' మూవీ చిత్రీకరణలో ఈ ప్రమాదం జరిగింది. సెట్‌లో ఉన్న వాహనం అదుపుతప్పి ఆమెను ఢీకొనడంతో పల్లవి జోషికి గాయాలయ్యాయి. గాయాలతోనే ఆ షాట్‌ను పూర్తి చేశారు పల్లవి. వెంటనే చిత్ర బృందం ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు.

పలు సినిమాలు, టెలివిజన్‌ కార్యక్రమాల ద్వారా పల్లవిజోషి ప్రేక్షకులకు పరిచయమే. అనేక బాలీవుడ్‌ సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. అయితే, గతేడాది విడుదలైన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'తో ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. దీనికి దర్శకత్వం వహించిన వివేక్‌ అగ్నిహోత్రి ప్రస్తుతం 'ది వ్యాక్సిన్‌వార్'ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుండగా ప్రమాదం జరిగింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.