ETV Bharat / entertainment

మీరా జాస్మిన్‌ టాలీవుడ్ రీ ఎంట్రీ.. హాట్ షోలతో ఛాన్స్ కొట్టేసిందిగా! - మీరా జాస్మిన్​ టాలీవుడ్ రీఎంట్రీ

భద్ర, గుడుంబా శంకర్‌, గోరింటాకు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటి మీరా జాస్మిన్‌ . టాలీవుడ్‌కు పదేళ్లు దూరంగా ఉన్న ఆమె త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా మీరా జాస్మిన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

meera jasmine tollywood entry
మీరా జాస్మిన్‌ టాలీవుడ్ రీ ఎంట్రీ.. హాట్ షోలతో ఛాన్స్ కొట్టేసిందిగా!
author img

By

Published : Feb 1, 2023, 6:53 PM IST

ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల కనుమరుగైపోయిన భామలు ఎందరో. వారిలో కొంతమంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. మరికొంత మంది మాత్రం తిరిగి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం హాట్ హాట్ ఫొటోషూట్లతో అందాలను ఆరబోస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్నారు. వారిలో మలయాళీ భామ మీరా జాస్మిన్ కూడా ఒకరు. 'భద్ర', 'గుడుంబా శంకర్‌', 'గోరింటాకు' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

ఒకప్పుడు హోమ్లీ లుక్స్‌తో వెండితెరపై అలరించిన మీరా ఇప్పుడు హాట్ గేర్ వేసి సోషల్ మీడియా లో హాట్ పుట్టిస్తోంది. తన గ్లామర్ వలను వేసి అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. అలా ఇప్పుడు తెలుగులో ఓ ఛాన్స్​ను అందుకుంది. దాదాపు టాలీవుడ్‌కు పదేళ్లు దూరంగా ఉన్న ఆమె త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. సోషల్‌ మీడియా వేదికగా ఆమెనె ఈ విషయాన్ని వెల్లడించారు. తన పాత్ర డబ్బింగ్‌కు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. బ్యాక్ టు తెలుగు సినిమా అని వ్యాఖ్య రాసు కొచ్చింది. సినిమా వివరాలను ప్రకటించలేదు. ఆమె ఏ చిత్రంలో నటిస్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

2001లో మలయాళంలో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన మీరా.. ఆ తర్వాత అమ్మాయి బాగుంది మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అనంతరం పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ, రవితేజవంటి అగ్ర కథానాయకుల సరసన నటించింది. గుడుంబా శంకర్, భద్ర, మహారథి లాంటి సినిమాలు చేసింది. గోరింటాకు లో రాజశేఖర్ చెల్లెలిగా కనిపించి ఆకట్టుకుంది. కన్నడతో పాటు తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆమె చివరిగా 2013లో తెలుగు సినిమా మోక్షలో నటించింది. ఆ తర్వాత ఆమె మలయాళం సినిమాలతో బిజీ అయ్యారు.

ఇదీ చూడండి: చిరు టు షారుక్.. సీనియర్​​​ హీరోస్​ కమ్​ బ్యాక్​​.. రూ. వందల కోట్లతో బాక్సాఫీస్​ షేక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.