ETV Bharat / entertainment

సినిమా షూటింగ్​లో హీరో వరుణ్​ సందేశ్​కు గాయాలు.. మూడు వారాల వరకు.. - varun sandesh telugu movies

యువ కథానాయకుడు వరుణ్ సందేశ్​కు గాయాలయ్యాయి. ఆర్యన్ శుభాన్ దర్శకత్వం వహిస్తున్న 'ది కానిస్టేబుల్' సినిమా షూటింగులో వరుణ్ గాయపడ్డట్టు తెలుస్తోంది. హీరో గాయం కారణంగా తాత్కాలికంగా సినిమా చిత్రీకరణను నిలిపివేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

varun sandesh injured in movie sets
సినిమా సెట్స్​లో వరుణ్​ సందేశ్​కు గాయాలు
author img

By

Published : Jun 21, 2023, 8:43 PM IST

Updated : Jun 21, 2023, 10:54 PM IST

యువ కథానాయకుడు వరుణ్ సందేశ్ గాయపడ్డాడు. హైదరాబాద్ శివారులో తన తాజా చిత్రం 'ది కానిస్టేబుల్' చిత్రీకరణలో పాల్గొన్న వరుణ్ సందేశ్... పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా కాలికి బలమైన గాయం తగిలింది. వెంటనే చిత్ర బృందం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. మూడువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

వరుణ్ సందేశ్ గాయపడటంతో 'ది కానిస్టేబుల్' సినిమా షూటింగును నిలిపివేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కాగా ఓ కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరిగే అంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా దాదాపు 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆర్యన్ శుభాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత రెండో షెడ్యూల్​లో సినిమా పూర్తి చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

'ఢీ' షోలో సందడి చేసిన వరుణ్..
'ఢీ' సీజన్ 16 గురువారం ప్రారంభంకానుంది. హైదరాబాద్​లో ఈ షో లాంచ్​​ ఈవెంట్​ను ఘనంగా నిర్వహించారు నిర్వహకులు. అయితే ఈ ఈవెంట్​కు హీరో వరుణ్​ సందేశ్​తో పాటు యాంకర్​ వీజే సన్నీ ముఖ్య అతిథులుగా హాజరై షో లో సందండి చేశారు.​ దీనికి సంబంధించిన వీడియో ప్రోమోను యూట్యూబ్​లో విడుదల చేశారు నిర్వాహకులు. అప్​లోడ్​ చేసిన కొన్నిగంటల్లోనే ఈ షో ప్రోమో లక్షల వ్యూస్​తో దూసుకుపోతోంది.

ఈ ప్రోమోలో స్టేజ్​పై హైపర్ ఆది కొన్ని పంచ్​లు వేస్తూ అందర్నీ నవ్వించారు. అయితే ఆ సమయంలో పెళ్లి కానీ సోదరులు పెళ్లి చేసుకోవచ్చా అని హైపర్ ఆది.. వరుణ్ సందేశ్​ను అడగగా.. 'పెళ్లి చేసుకోండి అదిరిపోతుంది' అంటూ కాస్త సెటైరికల్​గా అన్నారు. వెంటనే హైపర్ ఆది.. ఏంటి చెమటలు వస్తున్నాయి అంటూ నవ్వులు పూయించారు. ఆ వెంటనే వీజే సన్నీ కూడా.. ఇదే ప్రశ్నను శేఖర్​ మాస్టర్​ను అడగగా.. మళ్లీ హైపర్ ఆది మాట అందుకుని.. 'ఆయన చేసుకున్నా పెద్ద బాధ ఏమీ ఉండదు. ఇంటా, బయటా రెండు భోజనాలు చేస్తారు' అంటూ నవ్వించారు. దీనికి స్పందించిన శేఖర్ మాస్టర్.. ​'నీ యంకమ్మ.. ఆయన క్వశ్చన్​ అడిగింది నన్ను..​' అంటూ సరదాగా స్పందించారు.

హ్యాపీ డేస్​తో పరిచయం..
వరుణ్​ సందేశ్ 'హ్యాపీ డేస్' సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'కొత్త బంగారులోకం', 'కుర్రాడు' సినిమాలతో యూత్​లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 2016లోనే తన సహ నటి వితికాను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కలిసి 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత వరుణ్ నుంచి పెద్దగా సినిమాలు రాలేదు. మళ్లీ తెలుగు 'బిగ్​బాస్ సీజన్ 3' ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అదే సీజన్​లో వరుణ్ భార్య వితికా కూడా 'బిగ్​బాస్' షో లో పాల్గొ​న్నారు. దీంతో 'బిగ్​బాస్' హౌజ్​లో అడుగుపెట్టిన మొట్టమొదటి దంపతులుగా నిలిచారు.​ కాగా ఈ ఏడాది సందీప్ కిషన్​ హీరోగా నటించిన 'మైఖేల్​' సినిమాలో వరుణ్ కీలక పాత్రలో కనిపించారు.

Last Updated : Jun 21, 2023, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.