Sharwanand Marriage : టాలీవుడ్ హీరో శర్వానంద్-హర్షిత రెడ్డిల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి వేడుకకు రాజస్థాన్‌లోని జైపూర్ ప్యాలెస్ సుందరంగా ముస్తాబైంది. కాబోయే వధూవరులిద్దరూలతో పాటు కుటుంబ సభ్యులు ప్యాలెస్‌లో పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా మొదటి రోజు హల్దీ వేడుకలతో సందడి మొదలైంది. ఈ హల్దీ వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో శర్వానంద్ తెల్లని దుస్తులు ధరించాడు. అక్కడున్న వారి బంధువులకు శర్వానంద్‌కు పసుపు పూయడం కనిపించింది. ఇంకా మెహందీ, సంగీత్ వేడుకలు కూడా జరగనున్నాయి. జూన్3న వేదమంత్రాల సాక్షిగా రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు శర్వానంద్.
-
శర్వా పెళ్లి సందడి ❤️
— SharwAnand ✨️ (@SharwaFans) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Lovely & candid visuals from Hero @ImSharwanand 's Haldi 💛Ceremony in Jaipur 😍 #Sharwanand𓃵 #SharwAnand #Sharwa35 #Sharwa #haldifunction #marriage #ramcharan #prabhas #weddingvibes #Jaipur#SharwanandMarriage 🥰 ❤️ pic.twitter.com/nV0Kpbyise
">శర్వా పెళ్లి సందడి ❤️
— SharwAnand ✨️ (@SharwaFans) June 2, 2023
Lovely & candid visuals from Hero @ImSharwanand 's Haldi 💛Ceremony in Jaipur 😍 #Sharwanand𓃵 #SharwAnand #Sharwa35 #Sharwa #haldifunction #marriage #ramcharan #prabhas #weddingvibes #Jaipur#SharwanandMarriage 🥰 ❤️ pic.twitter.com/nV0Kpbyiseశర్వా పెళ్లి సందడి ❤️
— SharwAnand ✨️ (@SharwaFans) June 2, 2023
Lovely & candid visuals from Hero @ImSharwanand 's Haldi 💛Ceremony in Jaipur 😍 #Sharwanand𓃵 #SharwAnand #Sharwa35 #Sharwa #haldifunction #marriage #ramcharan #prabhas #weddingvibes #Jaipur#SharwanandMarriage 🥰 ❤️ pic.twitter.com/nV0Kpbyise
రక్షిత ఎవరంటే?.. హీరో శర్వానంద్‌తో జీవితం పంచుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ప్రస్తుతం ఆమె ఫారెన్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారట. ఆమె తండ్రి మధుసూదన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది. అంతే కాదు... ఆమె ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనమరాలు కూడా!
Sharwanand Wife : శర్వానంద్, రక్షితల నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ ఎంగేజ్మెంట్కు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రామ్ చరణ్ దంపతులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఇప్పుడు శర్వా, రక్షిత పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. జూన్ 3 ఉదయం 11:30 గంటలకు శర్వాను పెళ్లి కుమారుడు చేసే కార్యక్రమం ఘనంగా జరగనుంది. రాత్రి 11 గంటలకు శర్వా, రక్షిత మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు వేయబోతున్నారు. ఈ పెళ్లి వేడుకలకు సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరుకానున్నారు. అంతేకాకుండా శర్వానంద్ స్వయంగా వెళ్లి కొంతమంది ప్రముఖులను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
Sharwanand Movies : ఇక శర్వానంద్ సినిమాల విషయానికొస్తే.. శర్వా రీసెంట్ గా ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్‌ను అందుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సపోర్టింగ్ పాత్రలు మాత్రమే చేస్తూ తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. తర్వాత శర్వాలోని ప్రతిభను చూసి వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా గమ్యం, ప్రస్థానం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానంభవతి, మహానుభావుడు వంటి కమర్షియల్ హిట్స్‌ను అందుకున్నారు. మధ్యలో సరైన హిట్ లేక ఇబ్బంది పడినా తర్వాత మళ్లీ గాడిన పడ్డారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. పెళ్లి కోసం ఈ సినిమా షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చారు శర్వానంద్.