బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ గాయపడ్డారు. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా హీరోగా రూపొందుతున్న 'కేడీ' సినిమా షూటింగ్లో ఆయన గాయాలపాలైనట్లు తెలిసింది.
బాంబు సీక్వెన్స్ తీస్తుండగానే!
ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'కేడీ' సినిమా చిత్రీకరణ బెంగళూరులో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ రవి వర్మ నేతృత్వంలో ఓ భారీ బాంబు పేలుడు సన్నివేశం తీస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా బాంబు పేలడంతో సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం. ముఖానికి, చేతికి, భుజానికి గాయాలు అయ్యాయట. దీంతో వెంటనే చిత్రీకరణ నిలిపివేసి హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారట. అక్కడ ప్రాథమిక చికిత్స పొందిన సంజయ్ దత్.. ముంబయికి వెళ్లిపోయారట.
'కేడీ' సినిమాకు ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. తెలుగులో పలు సినిమాల్లో కథానాయికగా నటించిన 'ఇడియట్' ఫేమ్ రక్షిత భర్త. సినిమా అనౌన్స్ చేసినప్పుడు టీజర్ కూడా విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా టీజర్‌ను రూపొందించారు. 'రామాయణ యుద్ధం స్త్రీ కోసం.. మహాభారత యుద్ధం రాజ్యం కోసం.. ఈ కలియుగ యుద్ధం కేవలం రక్తం కోసం' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.
ఆ తరువాత కాళీ అనే వ్యక్తి రిలీజ్ అవుతున్నాడని.. పోలీసులు సిటీ మొత్తాన్ని అలెర్ట్ చేయడం, సిటీ లోపలకు అతడు రాకుండా చేయడానికి జాగ్రత్తలు తీసుకోవడం వంటి సన్నివేశాలను చూపించారు. అతడిని చంపడానికి వేల మంది జనాలు రెడీగా ఉన్నారని పోలీసులు అనుకుంటారు. కానీ ఆ వ్యక్తిని ఊరేగించడానికి వేల మంది జనాలు జైలు దగ్గరకు తరలివస్తారు. మెల్లగా నిప్పుల మధ్య హీరోను రివీల్ చేస్తూ.. 'ఫీల్డ్ లోకి దిగాక యుద్ధంచేయాల్సిందే.. చస్తే వీరమరణం.. గెలిస్తే సింహాసనం.. యుద్ధం మొదలెడదామా అన్నయ్యా' అంటూ హీరోతో డైలాగ్ చెప్పించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అదే సమయంలో 'కేడీ' అనే టైటిల్‌ను రివీల్ చేశారు. టీజర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అర్జున్ జన్య ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
కన్నడ చిత్రం కేజీఎఫ్‌తో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్.. దక్షిణాదిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. శాండిల్ వుడ్ కూడా.. తమ చిత్రసీమకు మరో సూపర్ విలన్ దొరికారని సంబరపడింది! కేజీఎఫ్‌లో అధీరా పాత్రలో సంజయ్ యాక్టింగ్ వేరే లెవల్. ఆ పాత్ర తర్వాత కన్నడ నుంచి సంజూకు చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే ఆయన మాత్రం ఆచితూచి క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటున్నారు.