ETV Bharat / entertainment

స్టార్​హీరోకు బెదిరింపులు.. గన్​లైసెన్స్​ మంజూరు చేసిన పోలీసులు - సల్మాన్​ ఖాన్​కు బెదరింపులు

Salman khan weapon license: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​కు తుపాకీ లైసెన్స్​ మంజూరు అయింది. ఈ విషయాన్ని ముంబయి పోలీసులు తెలిపారు.

Actor Salman Khan has been issued an Weapon license
సల్మాన్​ఖాన్​కు గన్​లైసెన్స్​ మంజూరు
author img

By

Published : Aug 1, 2022, 9:45 AM IST

Salman khan weapon license: బెదరింపులు వచ్చిన నేపథ్యంలో బాలీవుడ్‌ స్టార్‌, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తుపాకీ లైసెన్స్‌ కోరుతూ ఇటీవలే దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన దరఖాస్తు స్వీకరించిన ముంబయి పోలీసులు తాజాగా గన్​ లైసెన్స్​ను మంజూరు చేశారు.

కాగా, పంజాబ్‌ గాయకుడు సిద్ధూ మూసేవాలా గతే మీకూ పడుతుందంటూ.. సల్మాన్‌ఖాన్‌, ఆయన తండ్రి సలీంఖాన్‌లకు కొద్దిరోజుల క్రితం బెదిరింపు లేఖ రావడం బీటౌన్​లో తీవ్ర కలకలం రేపింది. రోజూ జాగింగ్‌ అయ్యాక సల్మాన్‌ కూర్చునే బెంచిపై ఈ లేఖ లభించినట్లు అప్పుడు పోలీసు వర్గాలు తెలిపాయి. 'త్వరలో సిద్ధూ మూసేవాలా లాంటి పరిస్థితే మీకు ఎదురవుతుంది' అంటూ దుండగులు ఆ లేఖలో బెదిరించారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసులు తీవ్రంగా పరిగణించారు. క్రైం బ్రాంచ్‌ పోలీసులు బంద్రాలోని గెలాక్సీ అపార్టుమెంటులో ఉంటున్న సల్మాన్‌ఖాన్‌ నివాసానికి వెళ్లి సలీం వాంగ్మూలం సేకరించారు. వారి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, ఈ బెదిరింపులను పబ్లిసిటీ స్టంట్‌గా అనుమానించారు. ఇంకా దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తుపాకీ లైసెన్స్‌ కోరుతూ నటుడు ముంబయి పోలీసు హెడ్‌క్వార్టర్‌లో కమిషనర్‌ వివేక్‌ ఫాన్సాల్కర్‌ను కలిసి లెసెన్స్​ను దరఖాస్తు చేశారు.

ఇదీ చూడండి: 'అదేం రాత్రికి రాత్రి రాలేదు.. ఏడేళ్లుగా ఎంతో కష్టపడుతున్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.