టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నడి రోడ్డుపై ఓ యువకుడితో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై ఓ వ్యక్తి తన ప్రేయసిపై చేయి చేసుకుంటున్న ఘటనను చూసిన ఆయన వెంటనే కారు దిగి ఆ వ్యక్తిని మందలించేందుకు ప్రయత్నించారు. ఆ యువతికి సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే చేయి చేసుకున్న వ్యక్తి.. ఆ అమ్మాయి తన గర్ల్‌ఫ్రెండ్ అంటూ బుకాయిస్తూ వచ్చాడు. దీంతో ఆగ్రహించిన శౌర్య.. గర్ల్‌ఫ్రెండ్ అయితే కొడతావా అంటూ కోప్పడ్డారు. ఈ సంఘటనతో అక్కడే గుమిగూడిన వారు సైతం నాగ శౌర్యకు మద్దతు పలుకుతూ ఆ వ్యక్తి.. ఆమెకు సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటన హైదరాబాద్‌లో ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
వీడియో చూసిన నెటిజన్లు హీరో నాగ శౌర్యను ప్రశంసిస్తూ.. రియల్ లైఫ్‌లో కూడా ఇతను హీరోనే అంటూ పలువురు నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆయన చేసిన పనికి సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే మరికొందరు ఇది నిజంగా జరిగిందా లేదా ఫ్రాంక్ వీడియోనా, ఏదైనా మూవీ ప్రమోషన్స్‌లో భాగమా అంటూ భిన్నాభిప్రయాలు వ్యక్తం చేస్తున్నారు.
-
Matter endi pic.twitter.com/IldGEqdxvr
— UnqBoi 🍥 (@UnqBoi007) February 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Matter endi pic.twitter.com/IldGEqdxvr
— UnqBoi 🍥 (@UnqBoi007) February 28, 2023Matter endi pic.twitter.com/IldGEqdxvr
— UnqBoi 🍥 (@UnqBoi007) February 28, 2023
ఇక ఇటీవలే తన చిరకాల ప్రేయసి అనుషా శెట్టి తో ఏడడుగులు వేసిన నాగశౌర్య.. ప్రస్తుతం తెలుగులో ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి అనే సినిమా షూట్లో బిజీగా ఉన్నారు. ప్రముఖ ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సాధించడంతో.. తాజా చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.
ఇప్పటికే రిలీజైన టీజర్‌తో పాటు ఓ బ్రేకప్ సాంగ్.. సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ఈ రెండూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమా మార్చి 17న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు నాగశౌర్య రీసెంట్ రిలీజ్ కృష్ణ వృంద విహారి బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయితే కామెడి పరంగా సినిమా కాస్తా నెట్టుకు రాగలిగిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.